రిస్క్ చేస్తున్న శ్రీలీల.. ఈ టైంలో అవసరమా అంటున్న ఫ్యాన్స్

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తాన్ని తన వెంట తిప్పికుంటోంది లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela). చిన్న హీరో అయినా, స్టార్ హీరో అయినా.. హీరోయిన్ మాత్రం శ్రీలీలనే. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపు తొమ్మిది సినిమాలున్నాయి. ఇక తాజాగా ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అదేంటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న పుష్ప2(Pushpa2)లో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను అనుకుంటున్నారట మేకర్స్. ఇక ఇదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించగా.. కాస్త సమయం అడిగిందట. ఇకపుష్ప ఫస్ట్ పార్ట్ లో సమంత చేసిన ఊ అంటావా.. ఊఊ అంటావా అనే సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుర్రకారును ఓ ఊపు ఊపేసింది ఈ పాట. 

ఇప్పుడు పుష్ప2 కోసం కూడా అదే రేంజ్ లో ఉండే స్పెషల్ సాంగ్ ను కంపోజ్ చేశారట దేవి శ్రీ ప్రసాద్. ఈ సాంగ్ కు బన్నీ అండ్ శ్రీలీల డాన్స్ వేస్తే ఈ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు సూపర్ డాన్సర్స్. ఆ మ్యాజిక్ ను ఆడియన్స్ కు అందించాలనే ఉద్దేశంతోనే మేకర్స్ శ్రీలీలను అనుకున్నారట. 

అయితే ఈ న్యూస్ తెలుసుకున్న శ్రీలీల అభిమానులు మాత్రం ఈ సాంగ్ చేయకపోవడం ,మంచిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల కెరీర్ పీక్స్ లో ఉంది ఇల్లాంటి సమయంలో స్పెషల్ సాంగ్స్ చేయడం అంటే రిస్క్ అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ ఆఫర్ కు శ్రీలీల ఒకే చెప్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.