కాబోయేవాడు ఎలా ఉండాలో శ్రీలీల చెప్పేసింది..మీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయా?

కాబోయేవాడు ఎలా ఉండాలో శ్రీలీల చెప్పేసింది..మీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయా?

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తాన్ని తన వెంట తిప్పికుంటోంది లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela). చిన్న హీరో అయినా, స్టార్ హీరో అయినా..హీరోయిన్ మాత్రం శ్రీలీలనే. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపు తొమ్మిది సినిమాలున్నాయి. 

ఇక లేటెస్ట్గా ఈ అమ్మడు తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. నన్ను కట్టుకోబోయేవాడికి ముచ్చటగా మూడు లక్షణాలుండాలి. అందులో ఫస్ట్ కొన్ని కొన్ని  విషయాల్లో నన్ను భరించడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భావించాలి..భరించాలి. 

రెండు..అతనికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ కలిగి ఉండాలి. నన్ను ఎప్పుడు తనదైన పంథాలో నవ్విస్తూ ఉండాలి. మూడు..కుటుంబానికి విలువ ఇస్తూ..ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలిసుండాలి. అంతే సింపుల్‌..ఈ మూడు లక్షణాలు ఉంటే చాలు..మూడు ముళ్ళు వేయించుకుని..ఏడడుగులు వేస్తా..అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల.

మరి అలాంటి రాకుమారులు ఎవరైనా తారసపడ్డారా ? అని అడిగితే ‘ఇంకా లేదు..ఒక వేళ ఎదురయిన..అతనిపై కాన్సన్‌ట్రేట్‌ చేసేంత టైమ్‌..లేదు. ప్రస్తుతం సినిమాల్లో నేను బిజీ..’ అంటూ తనదైన శైలిలో చెప్పింది శ్రీలీల. దీంతో ఫ్యాన్స్ సైతం..ఇటువంటి క్వాలిటీస్ తమలో ఉన్నాయో..లేవో చెక్ చేసుకోవడం మొదలెట్టేశారు. ఒకవేళ ఉంటే కనుక శ్రీలీల సోషల్ మీడియాకు స్వయంవరం మొదలైనట్టే! 

ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ బాబుతో గుంటూరు కారం, నితిన్ తో ఎక్స్ట్రా, నవీన్ పోలిశెట్టితో అనగనగ ఒకరాజు, రవితేజతో ఒక సినిమా, విజయ్ దేవరకొండతో మరో సినిమా చేస్తున్నారు. కొన్ని లైనప్ లో కూడా మూవీస్ ఉండటం విశేషం.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SIIMA (@siimawards)