Sreeleela Baby: మా ఇంటికి మరో చిట్టితల్లి వచ్చింది.. హీరోయిన్ శ్రీలీల ఎమోషనల్ పోస్ట్

Sreeleela Baby: మా ఇంటికి మరో చిట్టితల్లి వచ్చింది.. హీరోయిన్ శ్రీలీల ఎమోషనల్ పోస్ట్

సౌత్ లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) పోస్ట్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. లేటెస్ట్గా (2025 ఏప్రిల్ 27న) తన ఇంస్టాగ్రామ్లో ఓ చిన్నారితో దిగిన రెండు ఫొటోలను షేర్ చేసింది.

ఈ ఫొటోస్కి "ఇంటికి అదనంగా.. హృదయాలపై దండయాత్ర" అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోస్ చాలా స్పీడ్గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో శ్రీలీల పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఈ ఫొటోల్లో శ్రీలీల ఆ చిన్నారి పాపను ఆప్యాయంగా గుండెలకి హత్తుకుంది. మరొక దానిలో పాప బుగ్గపై శ్రీలీల ముద్దు పెడుతూ కనిపిస్తూ ఆకర్షిస్తోంది. ఈ ఫొటోస్ చూసిన ఆమె ఫ్యాన్స్ వీపరీతమైన ప్రేమను చూపిస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం అసలు ఈ పాప ఎవరు? శ్రీలీల సీక్రెట్గా పెళ్లి చేసుకుందా? లేక తన ఇంట్లో పాపానా? అంటూ పాపా గురించి పలు ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నారు.

అయితే, శ్రీలీల ఈ పాపని దత్తతు తీసుకున్నట్లు మరికొంత మంది నెటిజన్లు క్లారిటీ ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో మానవత్వాన్ని చాటుకున్న శ్రీలలపై, నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. సెలబ్రేటిస్ అందరూ ఇలానే మానవత్వాన్ని చాటుతుంటే, అనాథలు కనిపించరు కదా అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeleela (@sreeleela14)

అసలు విషయానికి వస్తే..

శ్రీలీలకి పిల్లలంటే చాలా ఇష్టం. 2022లో ఒక అనాథాశ్రమం నుండి 'గురు, శోభిత' అనే ఇద్దరు వికలాంగ పిల్లలను దత్తత తీసుకుంది. ఆ మాదిరిగానే ఆడపిల్లలపై తన ప్రేమను కొనసాగిస్తూ.. మరో పాపని దత్తతు తీసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే 'తన ఇంటికి మరో చిట్టితల్లి' వచ్చిందంటూ శ్రీలీల పోస్ట్ పెట్టింది. ఇకపోతే 2022లో వచ్చిన కన్నడం ఫిల్మ్ 'బై టూ లవ్' సినిమా విడుదలకు ముందే గురు, శోభిత అనే ఇద్దరి అమ్మాయిలను దత్తత తీసుకున్నట్లు సమాచారం.

శ్రీలీల కమింగ్ మూవీస్:

హీరోయిన్‌‌‌‌గా పరిచయమైన అతి కొద్దికాలంలోనే పాపులర్‌‌‌‌‌‌‌‌ అయిన శ్రీలీల.. వరుస స్టార్ హీరోల సినిమాలతో సెన్సేషనల్ అయింది. బ్యాక్ టు బ్యాక్ తొమ్మిది సినిమాల్లో చాన్స్‌‌‌‌లు అందుకుంది. అయితే అవకాశాలు వచ్చినంత ఈజీగా విజయాలు రాలేదు. దీంతో కెరీర్‌‌‌‌‌‌‌‌లో కొంత నెమ్మదించిన శ్రీలీల.. ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటోంది.

►ALSO READ | Samantha: బర్త్ డే స్పెషల్.. సమంత ఆస్తి ఎన్ని కోట్లు? ఒక్కో సినిమాకు ఎంత ఛార్జ్ చేస్తుంది?

ప్రస్తుతం బాలీవుడ్ నుంచి కూడా శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నట్లు సమాచారం. శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ జంటగా ఓ మూవీ రానుంది. దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తారు. టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.

ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆషికి ఫ్రాంచైజీ (ఆషికి 3) లో భాగం కావచ్చని టాక్. ఇక తెలుగులో చూసుకుంటే.. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మాస్ జాతర తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో శివ కార్తికేయన్ తో 'పరాశక్తి' మూవీలో నటిస్తుంది.