టీమిండియా మాజీ ఆటగాళ్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ గ్రౌండ్ లో ఎంత దూకుడుగా ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కోసారి వీరి అగ్రెస్సివ్ శృతి మించడంతో అది కాస్త గొడవలకు ఆ తర్వాత వివాదాలకు దారి తీస్తుంది. వీరి ఆటిట్యూడ్ కారణంగా కెరీర్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఎవరేమన్నా అసలు తట్టుకోలేని వీరిద్దరూ నిన్న జరిగిన మ్యాచ్ లో గొడవ పడుతూ కనిపించారు.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో భాగంగా నిన్న( డిసెంబర్ 6) గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత మాజీ క్రికెటర్లు శ్రీశాంత్, గౌతమ్ గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోగా రెండో ఓవర్ లో శ్రీశాంత్ బౌలింగ్ లో ఓపెనర్ గంభీర్ తొలి రెండు బంతులను వరుసగా 6,4 కొట్టాడు. అయితే ఆ తర్వాత రెండు బంతులను శ్రీశాంత్ డాట్ బాల్స్ వేసి గంభీర్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు.
అసలే ఒకమాట అంటే పది మాటలు వడ్డించే గంభీర్ శ్రీశాంత్ వైపు కోపంగా చూస్తూ వెంటనే రియాక్షన్ ఇచ్చాడు. ఇంతలో శ్రీశాంత్ దగ్గరికి రావడంతో మాట మాట పెరిగిపోయింది. అంపైర్లు సర్ది చెప్పడంతో ఇన్నింగ్స్ కొనసాగింది. సరదాగా ఆడుకునే ఆటలో చిన్నపిల్లల్లా గొడవ పడడంతో నెటిజన్స్ వీరిఫై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ కాపిటల్స్ 12 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. గంభీర్ 30 బంతుల్లో 51 పరుగులు చేసి రాణించాడు. గుజరాత్ జట్టులో గేల్ 84 పరుగులు చేసి పోరాడినప్పటికీ విజయాన్ని అందించలేకపోయాడు.
6... 4... Showdown! Watch till the end for Gambhir ? Sreesanth.
— FanCode (@FanCode) December 6, 2023
.
.#LegendsOnFanCode @llct20 pic.twitter.com/SDaIw1LXZP