వన్డేల్లో ఆల్ టైం గ్రేట్ బ్యాటర్ ఎవరు.. ఈ విషయంపై గత కొన్నేళ్లుగా చర్చ నడుస్తూనే ఉంది. విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ కారణంగా సచిన్ రికార్డులన్నీ ఒక్కొక్కటిగా బ్రేక్ చేసే క్రమంలో ఈ ప్రస్తావన వచ్చింది. సచిన్ గ్రేట్ అని కొందరు అంటుంటే.. కాదు విరాట్ అని మరికొందరు అంటూ సోషల్ మీడియాలో ఎప్పడికప్పుడు దీని గురించి రచ్చ జరుగుతూనే వస్తుంది. ఈ విషయంపై మాట్లాడుతూ ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఖవాజా సచిన్ కన్నా విరాట్ వన్డేల్లో గ్రేట్ చెప్పుకొచ్చాడు.
ఖవాజా మాట్లాడుతూ క్రికెట్ లో ఆల్ టైం బ్యాటర్ సచిన్ అయినప్పటికీ.. వన్డేల్లో కోహ్లీ గణాంకాలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఇంకా 300 వందలు మ్యాచ్ లు ఆడకుండానే దాదాపు సచిన్ రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. అయితే ఖవాజా చేసిన ఈ కామెంట్స్ భారత మాజీ బౌలర్ శ్రీశాంత్ కు నచ్చలేదు. ఖవాజా వ్యాఖ్యలను కొట్టి పారేస్తూ నేటి బౌలర్లను ఎదుర్కొంటే టెండూల్కర్ 200 అంతర్జాతీయ సెంచరీలు చేసి ఉండేవాడని, అది కూడా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లపైనే అని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు.
ALSO READ : Cricket World Cup 2023: తొలి మ్యాచ్‌లోనే రోహిత్ రికార్డ్ బ్రేక్.. ఆస్ట్రేలియా ఓపెనర్ అరుదైన ఘనత
శ్రీశాంత్ మాట్లాడుతూ.. “సచిన్ ఇలాంటి వికెట్లపై బ్యాటింగ్ చేసి ఉంటే, అతను 100 సెంచరీలు కాకుండా 200 సెంచరీలు చేసి ఉండేవాడు. నేను విరాట్‌కు వ్యతిరేకంగా ఏమీ అనడం లేదు. అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు పూర్తిగా వీరు. ఇప్పుడు ఫిట్ నెస్ పై శ్రద్ధ తీసుకోవడంలో సహాయక సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. అప్పటి బౌలింగ్ లో చాలా నాణ్యత ఉంది.సచిన్‌ను కోహ్లీతో పోల్చడం అర్ధం లేని వ్యాఖ్యలు అని ఈ మాజీ ఫాస్ట్ బౌలర్ తెలిపాడు.
కాగా..ఇప్పటివరకు సచిన్ 452 ఇన్నింగ్స్‌లలో 44.83 సగటుతో 18426 పరుగులు చేయగా, కోహ్లీ 274 ఇన్నింగ్స్‌లలో 58.16 సగటుతో 13437 పరుగులు చేశాడు. టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేయడానికి కోహ్లీ మరో సెంచరీ మాత్రమే కావాలి. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో ఈ రికార్డ్ బద్దలవడం ఖాయమంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.