ODI World Cup 2023: పాక్‪ను ఓడించటానికి రోహిత్, కోహ్లీ అక్కర్లేదు..మా కుర్రాళ్లు చాలు: భారత మాజీ పేసర్

ODI World Cup 2023: పాక్‪ను ఓడించటానికి రోహిత్, కోహ్లీ అక్కర్లేదు..మా కుర్రాళ్లు చాలు: భారత మాజీ పేసర్

వరల్డ్ కప్ లో ఎన్నో అంచనాల మధ్య జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఈ సారి పాక్ బలంగా ఉందని, భారత్ విజయం సాధించడం కష్టమేనని పాక్ ఫ్యాన్స్ తో పాటు ఆ దేశ మాజీలు సైతం రెచ్చిపోయారు. కానీ పాక్ మాత్రం కనీసం పోటీనివ్వకుండా చేతులేత్తిసింది. దీంతో బ్లాక్ బస్టర్ మ్యాచుగా భావించిన ఈ సమరం కాస్త బోరింగ్ గా ముగిసింది. చిరకాల ప్రత్యర్థిని పసికూనగా మార్చేసి వరల్డ్ కప్ లో వరుసగా ఎనిమిదో విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఇదిలా ఉండగా ఓటమిని హుందాగా ఒప్పుకోకుండా పాక్ వంకలు చూపించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా కోచ్ మిక్కీ ఆర్ధర్ ఇది ఐసీసీ టోర్నీల లేదు భారత్ ఈవెంట్ లా ఉందని చెత్త కారణం చెబుతూ రెచ్చిపోయాడు. ఇక పాక్ క్రికెట్ బోర్డు అయితే అహ్మదాబాద్ ఫ్యాన్స్ ప్రవర్తన సరిగా లేదని ఐసీసీకి ఫిర్యాదు చేసి ఫూల్ అయింది. తాజాగా భారత మాజీ పేసర్ శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలపై స్పందించాడు.

Also Read : IND vs NZ: కివీస్‍కు సవాల్ విసురుతున్న భారత పేసర్లు.. 2 వికెట్లు డౌన్

     

శ్రీశాంత్ మాట్లాడుతూ.. “మిక్కీ ఆర్ధర్ ఫైనల్‌లో కలుద్దామని చెప్పాడు. ఐసిసి ట్రోఫీలో వారి జట్టును పరిగణనలోకి తీసుకుని మరే ఇతర ఈవెంట్‌లోనైనా పాకిస్తాన్ భారత్‌ను ఓడించగలదని నేను అనుకోను. మా 'సి' జట్టు కూడా పాకిస్థాన్ ప్రధాన జట్టును ఓడించగలదు. ఆడని ఆటగాళ్లతో IPL  XI ని తయారు చేయండి. వారు కూడా పాకిస్తాన్ జట్టును ఓడించగలరు" అని శ్రీశాంత్ స్పోర్ట్స్‌కీడాతో  తెలిపాడు 

ఈ సందర్భంగా ఈ సారి ఒత్తిడి తట్టుకోకపోతే పాకిస్థాన్ భారత్ కు రావద్దని మండిపడ్డాడు. ఇక్కడ క్రికెట్ కు భారీ క్రేజ్ ఉంటుంది. ఆ మాత్రం హడావుడి ఉంటుంది. గెలవడం చేతకాక ఇలాంటి చెత్త సాకులు చెప్పొద్దని ఈ మాజీ పేసర్ నిర్మొహమాటంగా చెప్పేసాడు.  ఒత్తిడిని తట్టుకోవడానికి భారత దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని మంత్రాన్ని గుర్తుంచుకోవాలని  సూచించాడు.