
హీరో శ్రీవిష్ణు(SreeVishnu), కమెడియన్స్ ప్రియదర్శి(Priyadarshi), రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఓం భీం బుష్(Om Bheem Bush). అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యంగ్ డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి(SreeHarsha konuganti) తెరకెక్కించారు. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ సినిమా మార్చ్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్యాప్షన్ కు తగ్గట్టుగానే లాజిక్స్ కి చాలా దూరంగా ఓన్లీ మ్యాజిక్ వర్కౌట్ అయిన ఈ సినిమా తగ్గట్టుగానే ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ హారర్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓం భీం బుష్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఓం భీం బుష్ థియేట్రికల్ రిలీజ్ తరువాత కానీసం నెలరోజుల గ్యాప్ తరువుత ఓటీటీలో రిలీజ్ చేయాలని. ఆ ప్రకారం చూసుకుంటే.. ఓం భీం బుష్ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది.
అయితే.. ఈ మధ్య చాలా సినిమాలు నెలరోజుల కంటే ముందుగానే ఓటీటీకి వచ్చి ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. అదే విధంగా ఓం భీం బుష్ మేకర్స్ కూడా అనుకున్న తేదీకన్నా ముందే ఓటీటీలో రిలీజ్ చేశారా లేక నెల రోజుల తరువాతనే స్ట్రీమ్ చేస్తారా అనేది చూడాలి మరి. మరి మొదటిరోజు పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఓం భీం బుష్ సినిమా రానున్న రోజుల్లో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. మార్చ్ 29వరకు వేరే సినిమాలు కూడా లేవు కాబట్టి ఈ సినిమాకు ఆది ప్లస్ కానుంది.