Om Bheem Bush Movie Review: లాజిక్స్ లేని మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా.. ఓం భీమ్ బుష్ టాక్ ఏంటి?

Om Bheem Bush Movie Review: లాజిక్స్ లేని మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా.. ఓం భీమ్ బుష్ టాక్ ఏంటి?

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శ్రీవిష్ణు(SreeVishnu), కమెడియన్స్ ప్రియదర్శి(Priyadarshi), రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) కాంబోలో వచ్చిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్(Om Bheem Bush). నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. హుషారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీహర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు(మార్చ్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ లాజిక్స్ లేని మ్యాజికల్ కథ ఎంతవరకు ఆడియన్స్ ను ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
కృష్ణకాంత్ దుగ్గిరాల (శ్రీ విష్ణు), మాధవ్ రేలంగి (రాహుల్ రామకృష్ణ), వినయ్ గుమ్మడి (ప్రియదర్శి) ముగ్గురు ఫ్రెండ్. చదువులు కంప్లీట్ అయినా తమకు జాబులు రావడంలేదని, ఓ యూనివర్సిటీలో పీహెచ్డీ చేయాలని జాయిన్ అవుతారు. అక్కడ వాళ్ళు చేసే గోల భరించలేదు కష్టపడకుండానే వారికి డిగ్రీలు ఇచ్చి బయటకు పంపిచేస్తారు. అలా ముగ్గురు వినయ్ ఊరికి బయల్దేరతారు. కానీ, మధ్యలో డీజిల్ అయిపోయిన కారణంగా.. భైరవపురంలో ఆగాల్సి వస్తుంది. అక్కడ ఒక మంత్రగాడు చిన్న చిన్న పనులు చేసి బాగా డబ్బులు సంపాదించడం చూస్తారు. దాంతో వాళ్ళు కూడా అదే ఊళ్ళో బ్యాంగ్ బ్రోస్ ఏ టు జెడ్ సొల్యూషన్స్ ఏర్పాటు చేసి అక్కడి జనాల సమస్యలు తీరుస్తూ వాళ్లకి దేవుళ్లుగా మారుతారు. అది గమనించిన ఆ మంత్రగాడు.. ఆ ముగ్గురికి ఒక సవాల్ విసురుతాడు. ఇంతకీ ఆ సవాల్ ఏంటి? అందులో ఆ ముగ్గురు గెలిచారా? సంపంగి మహల్ కథేంటి? దానికి ఊరుకి ఉన్న లింక్ ఏంటి? అనేది తెలియాలంటే ఓం భీమ్ బుష్ సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ:
ఓం భీమ్ బుష్ కథ లాజిక్స్ లేని ఓ కామెడీ ఎంటర్టైనర్. సినిమా స్టార్ట్ అవడం కూడా అదే టోన్ లో స్టార్ట్ అవుతుంది. ప్రధాన పాత్రల ఇంట్రో, కాలేజీలో చేసే అల్లరి, భైరవపురంలో ఎంటర్ అవడం అవన్నీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. ఇక ఊళ్ళో దిగాక ఈ ముగ్గురు చేసే పనులు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ సన్నివేశాలన్నీ లాజిక్స్ చాలా దూరంగా ఉంటాయి. కానీ, అవి పక్కన పెడితే ఎంటర్టైన్ అవ్వొచ్చు. 

ఇక ఇంటర్వెల్ తరువాత సంపంగి మహల్, సంపంగి దెయ్యం నేపధ్యంలో వచ్చే సీన్స్ హిలేరియస్ గా ఉంటాయి. ఆ తరువాత ఆ మహల్, దెయ్యం కథ తెలుసుకోవడానికి ఆ ముగ్గురు చేసి ప్రయత్నాలు కూడా నవ్వులు పూయిస్తాయి. అయితే.. క్లైమాక్స్ మాత్రం కాస్త డిజిపాయింట్ చేస్తుంది. ఎందుకంటే.. అప్పటివరకు కామెడీగా సాగిన సినిమా ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ఎండింగ్ కూడా ఆలాగే డిజైన్ చేశారు. చివరిగా ఓ మెసేజ్ కూడా ఇచ్చారు. అది కాస్త లాజిక్స్ కి దూరంగా ఉందేమో అనిపిస్తుంది. కానీ, ఈ సినిమా ట్యాగ్ లైనే అది కాబట్టి ఎం చేయలేము. 

నటీనటులు:
హీరో శ్రీవిష్ణు గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎప్పటిలాగే తనదైన కామెడీ టైమింగ్ తో రెచ్చిపోయారు. ఇక ఆయనకు తగ్గట్టుగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా దుమ్ముదులిపేశారు. సినిమా మొత్తాన్ని ఈ ముగ్గురు తమ భుజాలపై మోశారు. హీరోయిన్స్ కూడా తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. ఇక వీరి తరువాత చెప్పుకోవాల్సింది శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి గురించి. మెయిన్ లీడ్ తరువాత ఈ పాత్రలు ఆడియన్స్ ను తెగ ఆకట్టుకున్నాయి. ఇక సంపంగి దెయ్యంగా ఎవరో చేశారో గాని ఒక రేంజ్ లో పెరఫార్మెన్స్ ఇచ్చారు. సినిమాకి హైలెట్ గా నిలిచింది ఆ పాత్ర.

also read : దేవర వీడియో లీక్.. షాకులో మేకర్స్

సాంకేతిక వర్గం:
ఓం భీమ్ బుష్ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి. సంపంగి మహల్ సెట్ చాలా అద్భుతంగా ఉంది. సినిమా సెకండ్ హాఫ్ మొత్తం అక్కడే తిరుగుతుంది కాబట్టి ఆడియన్స్ కు ఒక కొత్త లొకేషన్ కు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఆ లొకేషన్ ని అంతే అద్భుతంగా చూపించడంలో సూపర్ సక్సెస్ అయ్యారు కెమెరామెన్ రాజ్ తోట. పల్లెటూరు అందాలని, భైరవ పురం ఊరుని చాలా అందంగా చూపించారు. ఇక ఈ సినిమాకు సన్నీ అందించిన సంగీతం సో సోగానే ఉంది. పాటలు పెద్దగా లేకపోయినా.. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పరవాలేదు అనిపించేలా ఉంది. యువీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. 

ఇక ఓం భీమ్ బుష్ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. లాజిక్స్ లేకుండా వచ్చి మ్యాజిక్ ను ఎంజాయ్ చేయడానికి వస్తే మాత్రం ఫులుగా నవ్వుకోవచ్చు.