హీరో శ్రీవిష్ణు (SreeVishnu), కమెడియన్స్ ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఓం భీం బుష్(Om Bheem Bush). అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యంగ్ డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి (SreeHarsha konuganti) తెరకెక్కించారు.
నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ సినిమా మార్చ్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్యాప్షన్ కు తగ్గట్టుగానే లాజిక్స్ కి చాలా దూరంగా ఓన్లీ మ్యాజిక్ వర్కౌట్ అయిన ఈ సినిమా తగ్గట్టుగానే ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ హారర్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ వచ్చింది.
దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మంచి ఓపెనింగ్‌ను కలిగి ఉన్న రెండు రోజుల్లో భారీగా వసూళ్లను రాబట్టిందనే చెప్పుకోవాలి. సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనూ కలెక్షన్స్ ను అదరగొడుతుంది. ఈ సినిమా ఒక్కరోజుకు 6.56 కోట్లు సంపాదించింది.
ఓవరాల్గా ఓం భీం బుష్ మూవీ మూడు రోజులలో వరల్డ్ వైడ్ గా రూ. 17 కోట్లు వసూలు చేసింది.ఇక మూడో రోజైన ఆదివారం ఏకంగా రూ.6.56 కోట్లు వసూలు చేసింది.రెండు రోజుల్లో మొత్తంగా రూ.10.44 కోట్లు వచ్చాయి.రూ.10 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. అప్పుడే లాభాల బాట పట్టింది.
Truly overwhelmed by the incredible response and love you have shown towards our #OmBheemBush. All your positive feedback has been the driving force behind our success.
— Sree Vishnu (@sreevishnuoffl) March 25, 2024
Thank you❤️🤗 https://t.co/iwJhlvARWS
ఇది శ్రీ విష్ణుకు వీకెండ్ లో వచ్చిన హైయెస్ట్ వసూళ్లు.అంతేకాకుండా USAలో కూడా సూపర్ సాలిడ్ హిట్ ను కంటిన్యూ చేస్తోంది. ఇది రీజియన్‌లో 3 రోజుల్లో $315K వసూలు చేసింది. ఇవాళ హోలీ సెలబ్రేషన్స్ కూడా ఉండటంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.
ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఓం భీం బుష్ థియేట్రికల్ రిలీజ్ తరువాత కనీసం నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ ప్రకారం చూసుకుంటే.. ఓం భీం బుష్ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది.