
ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట దారుణంగా సాగుతోంది. గత సీజన్లో రికార్డ్ స్కోర్లు నమోదు చేయడంతో ఈ సారి హైదరాబాద్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సీజన్‌ను ప్రారంభించింది. తొలి మ్యాచులోనే రాజస్థాన్ రాయల్స్‌పై ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్ 286 పరుగులు చేసింది. దీంతో ఇక ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్ ఆనందానికి అడ్డే లేకుండాపోయింది. అయితే.. హైదరాబాద్ అభిమానులకు ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు.
ఎందుకంటే.. ఆ తర్వాత ఆడిన 4 మ్యాచుల్లో హైదరాబాద్ వరుసగా ఓటమి పాలైంది. ఆ తర్వాత పంజాబ్‌పై 245 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి మరో రికార్డ్ విజయం సాధించింది. ఈ సంతోషంలో ఉండగానే.. ముంబైతో జరిగిన మ్యాచులో మళ్లీ ఓటమి బాటపట్టింది. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ ప్రదర్శనపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ విమర్శలు గుప్పించారు. ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ వర్మపైనే హైదరాబాద్ అతిగా ఆధారపడుతోందని అదే ఎస్ఆర్హెచ్ ఓటములకి ప్రధాన కారణమన్నారు.
ALSO READ | ఇప్పటికే ఓటమి బాధలో ఉన్నామంటే మళ్లీ ఇదొకటి: IPL వదిలి వెళ్లిపోతున్న కమిన్స్..?
ఓపెనర్స్ విఫలమైతే మిడిల్ ఆర్డర్ ఏ మాత్రం రాణించడం లేదని.. ఇన్సింగ్స్‌ను నిర్మించే బాధ్యతను మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తీసుకోకపోవడంతోనే హైదరాబాద్‌కు పరాజయాలు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రతి మ్యాచులో ఓపెనర్స్ రాణించలేరని.. అప్పుడు మిడిల్ ఆర్డర్ బాధ్యత తీసుకుని ఆడాల్సి ఉంటుందని సూచించారు. గత సీజన్లో ఓపెనర్స్ హెడ్, అభిషేక్ దాదాపు ప్రతి మ్యాచులో రాణించడంతో మిడిల్ ఆర్డర్ లోపం బయటపడలేదని.. కానీ ఈ సీజన్లో అలా కాదన్నారు.
ఈ సీజన్లో ఓపెనర్స్ హెడ్, అభిషేక్ అంచనాల మేర రాణించలేపోతున్నారని.. ఈ సమయంలో జట్టును ఆదుకోవాల్సిన మిడిల్ ఆర్డర్ కూడా చేతులేత్తయడంతో హైదరాబాద్ ఓటములు చవి చూడాల్సి వస్తోందన్నారు. టాపార్డర్ విలఫమైనప్పుడు తమ సత్తా ఏంటో చూపించుకునేందుకు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు ఒక మంచి అవకాశం కానీ వారు దానిని ఉపయోగించుకోవడం లేదని విమర్శించారు. ఇకనైనా హెడ్, అభిషేక్ ఇద్దరిపైనే ఆధారపడకుండా.. మిడిల్ ఆర్డర్‌ను ఎస్ఆర్హెచ్ మెరుగుపర్చుకోవాలని సూచించాడు క్లార్క్.
కాగా, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి దుర్బేద్యమైన ఆటగాళ్లతో కూడిన హైదరాబాద్ మిడిల్ ఆర్డర్.. అంచనాల మేర రాణించడంలో విఫలమవుతోంది. సీజన్ మొదటి మ్యాచులో సెంచరీతో దుమ్మురేపిన కిషన్.. ఆ తర్వాత పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇక, విధ్వంసకర ప్లేయర్ క్లాసెన్, నితీష్ రెడ్డి కూడా స్థాయి తగ్గ ప్రదర్శన చేయకపోవడం హైదరాబాద్‌కు ఇబ్బందిగా మారింది. ఇక, కమిన్స్ కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన ఎస్ఆర్ హెచ్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి.. ఐదు గేముల్లో ఓటమి పాలైంది