SRH ఫాస్ట్ బౌలర్ తండ్రి కూరగాయల వ్యాపారి

SRH ఫాస్ట్ బౌలర్ తండ్రి కూరగాయల వ్యాపారి
  • SRH నుండి మరో క్రికెటర్ ఫేమస్.. అతని తండ్రి కూరగాయల వ్యాపారి
  • అప్పట్లో ఆటోవాలా కొడుకు సిరాజ్.. ఇప్పుడు  కూరగాయల వ్యాపారియ కొడుకు ఉమ్రాన్ మాలిక్
  • SRH నుండి ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన రషీద్, ముస్తాఫిజుర్ ఫేమస్


హైదరాబాద్ : ఈ సీజన్ ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి అంచనాలు లేకుండానే అద్భుతమైన ఆట తీరుతో టాప్ లోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ టీమ్ అంటేనే మేయిన్ గా బౌలింగ్ తో అదరగొడుతుందని కొన్ని సంవత్సరాలుగా టాక్. ఈ సారి బ్యాటింగ్ లోనూ రాణిస్తూ టాప్ టీమ్స్ కే గట్టి పోటీ ఇస్తుంది. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ తో పాటు మరో పేరు ఈ సారి హాట్ టాపిక్ అయ్యింది. అతడే ఉమ్రాన్ మాలిక్. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున దుమ్మురేపుతున్న ఉమ్రాన్ మాలిక్.. తన పేస్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెయిడిన్ ఓవర్‌తో పాటు మూడు వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. 20వ ఓవర్‌లో ఈ ఘనతను అందుకున్న ఫోర్త్ పేసర్‌గా గుర్తింపుపొందాడు.

ఎవరీ ఉమ్రాన్..?

దీంతో అతడిపై చర్చలు ప్రారంభంకాగా.. ఎవరీ ఉమ్రాన్ మాలిక్ అని ఆరా తీయగా అతని తండ్రి ఓ కూరగాయల వ్యాపారి అని తెలిసిందట. జమ్మూలోని షాహిది చౌరస్తా‌లో పండ్లు, కూరగాయాల షాప్ నడుపుతూ జీవనం సాగించే అబ్దుల్ రషీద్ కొడుకే ఉమ్రాన్ మాలిక్. విషయం తెలుసుకున్న స్థానికులు నువ్వు ఉమ్రాన్ తండ్రివా అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారని స్వయానా అబ్దుల్ రషీద్ ఓ ఫేమస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. అంతేకాదు.. జమ్మూ కశ్మీర్‌కు వచ్చే పర్యాటకులు నువ్వు ఉమ్రాన్ మాలిక్ తండ్రివా? అని అడుగుతుంటే చాలా గొప్పగా ఉందని అబ్దుల్ రషీద్ చెప్పుకొచ్చాడు. కొడుకు అద్బుత ప్రదర్శన పట్ల ఉప్పొంగిపోతున్న అబ్దుల్ రషీద్.. ఉమ్రాన్ మాలిక్ సక్సెస్‌కు కారణమైన అబ్దుల్ సమద్, ఇర్ఫాన్ పఠాన్‌లకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపాడు. ఉమ్రాన్ మార్కెట్‌లో నన్ను సెలెబ్రిటీని చేశాడని.. మార్కెటే కాదు జమ్మూ మొత్తం నేను తెలిసిపోయానని చెప్పాడు.

SRH నుంచే వీరంతా

మార్కెట్‌లో ప్రతీ ఒక్కరూ నన్ను అభినందిస్తున్నారని.. నా కొడుకు పట్ల నేను గర్వంగా ఉన్నానన్న ఆయన.. ఉమ్రాన్ చాలా మొండివాడని తెలిపారు. ఫాస్ట్ బౌలర్ కావాలనేది అతని ఆశయయని.. దాని కోసం చాలా కష్టపడ్డాడని తెలిపాడు.  జమ్మూలోని షాహిది చౌరస్తా‌లో పండ్లు, కూరగాయాల షాప్ నడుపుతూ జీవనం సాగించే అబ్దుల్ రషీద్.. కొడుకు ఉమ్రాన్ మాలిక్ అద్భుత ప్రదర్శన కారణంగా ఆ ప్రాంతంలో ఫేమస్ అయ్యాడు. ఐపీఎల్ ఎంతో మందిని హీరోలుగా తయారు చేస్తుందని.. అప్పట్లో హైదరాబాద్ కుర్రాడు సిరాజ్ తండ్రి ఆటోవాల, అలాగే అఫ్గానిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్, ముస్తఫిజుర్ కూడా ఐపీఎల్ ఎంట్రీతో హీరోలుకాగా.. వీరందరూ SRH నుండే ఫేమస్ కావడం గర్వకారణమంటూ ట్వీట్స్ వదులుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

ఎఫ్ -3 ట్రైలర్ వచ్చేస్తుంది..!

రషీద్ ధమాకా

భగీరథ నీటిలో రొయ్యపిల్ల