ఐపీఎల్ 2025 కోసం సన్ రైజర్స్ రిటైన్ ప్లేయర్స్ జాబితా అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ 2024 లో సూపర్ పెర్ఫామెన్స్ చేసిన ట్రావిస్ హెడ్, నితీశ్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కొనసాగనున్నారు. హెన్రిచ్ క్లాసెన్, కెప్టెన్ పాట్ కమిన్స్, ఓపెనర్ అభిషేక్ శర్మతోపాటు ఈ ఇద్దరినీ రిటైన్ చేసుకొని పటిష్టంగా కనిపిస్తుంది.
హార్డ్ హిట్టర్ క్లాసెన్‌ను తొలి ఆప్షన్‌గా తీసుకొని అతనికి రూ. 23 కోట్లు ఇచ్చింది. కమిన్స్‌కు 18 కోట్లు, అభిషేక్ 14 కోట్లు, హెడ్‌కు 14 కోట్లు యంగ్‌స్టర్ నితీశ్‌ను రూ. 6 కోట్లతో రిటైన్ చేసుకుంది. ఈ ఐదుగురి కోసం రూ. 75 కోట్లు మినహాయిస్తున్న సన్ రైజర్స్ కేవలం 45 కోట్లతోనే వేలంలో పాల్గొననుంది.
క్లాసన్ సన్ రైజర్స్ తరపున రెండు సీజన్ లు గా అంచనాలకు మించి రాణిస్తున్నాడు. జట్టులో మిగిలిన ఆటగాళ్లు విఫలమైనా ఒక్కడే వారియర్ లా పోరాడిన మ్యాచ్ లు ఎన్నో ఉన్నాయి. దీంతో ఈ సఫారీ ఆటగాడికి అన్ని కోట్లు ఇవ్వడంలో న్యాయం ఉందంటున్నారు నెటిజన్స్. క్లాసన్ తో పాటుగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్, భారత యువ సంచలనం అభిషేక్ శర్మను రిటైన్ చేసుకుంది.
2024 ఐపీఎల్ లో కమ్మిన్స్ తన కెప్టెన్సీతో జట్టును ఫైనల్ కు చేర్చాడు. దీంతో మరోసారి సన్ రైజర్స్ యాజమాన్యం నమ్మింది. అభిషేక్ శర్మ ఐపీఎల్ తో పాటు టీమిండియా తరపున మెరుపు ఇన్నింగ్స్ లు ఆడిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురితో పాటుగా ఐపీఎల్ 2024 సీజన్ లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియన్ పవర్ హిట్టర్ ట్రావిస్ హెడ్, భారత యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా సన్ రైజర్స్ జట్టులో కొనసాగనున్నారు.
SRH Retentions For IPL 2025! pic.twitter.com/dCQcg1GipF
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) October 31, 2024