
హెచ్ సీఏ, సన్ రైజర్స్ మధ్య వివాదం ముగిసింది. బీసీసీఐ, ఎస్ఆర్‌హెచ్, హెచ్‌సీఏ ట్రైపార్టీ ఒప్పందం మేరకు పని చేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి.
ఏప్రిల్ 1న HCA కార్యదర్శి ఆర్. దేవ్ రాజ్ తో సన్ రైజర్స్ ప్రతినిధులు కిరణ్, శరవణన్, రోహిత్ ఉప్పల్ స్టేడియంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అన్ని విభాగాలలో అందుబాటులో ఉన్న 10 శాతం టికెట్లు కేటాయించాలని SRH ప్రతిపాదించింది. దీనిపై SRH CEO శ్రీ షణ్ముగంతో చర్చలు జరిపిన హెచ్ సీఏ ప్రతినిధులు తీర్మానాన్ని అంగీకరించారు.
ALSO READ : HCA, SRH వివాదం.. ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్ హెచ్‌కు పూర్తిగా సహకరిస్తామని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. ఈ మేరకు వివాదాలన్ని ముగిశాయని హెచ్‌సీఏ - ఎస్ఆర్‌హెచ్‌సంయుక్తంగా ప్రకటించాయి.