
అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ (IPL 2025) 18వ ఎడిషన్ షెడ్యూల్‌ను గవర్నింగ్ కౌన్సిల్ ఆదివారం(ఫిబ్రవరి 16) విడుదల చేసింది. ఈ టోర్నీ మార్చి 22న ప్రారంభమై మే 25న జరిగే ఫైనల్‌తో ముగియనుంది.
మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌ల్లో తలపడనుంది. ఇందులో 7 హోమ్ గ్రౌండ్‌లో.. మరో 7 ప్రత్యర్థి వేదికల్లో జరగనున్నాయి.
తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుండగా.. ఆ మరుసటి రోజే(మార్చి 23) హైదరాబాద్ - రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదిక. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం మొత్తం 9 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ఇందులో లీగ్ మ్యాచ్‌లు 7 కాగా.. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు 2 ఉన్నాయి.
సన్‌రైజర్స్ మ్యాచ్‌ల షెడ్యూల్
- మార్చి 23: సన్‌రైజర్స్ vs రాజస్థాన్ రాయల్స్ (ఉప్పల్ స్టేడియం)
- మార్చి 27: సన్‌రైజర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (ఉప్పల్ స్టేడియం)
- మార్చి 30: సన్‌రైజర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (వైజాగ్ స్టేడియం)
- ఏప్రిల్ 03: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
- ఏప్రిల్ 06: సన్‌రైజర్స్ vs గుజరాత్ టైటాన్స్ (ఉప్పల్ స్టేడియం)
- ఏప్రిల్ 12: సన్‌రైజర్స్ vs పంజాబ్ కింగ్స్ (ఉప్పల్ స్టేడియం)
- ఏప్రిల్ 17: ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ (వాంఖడే స్టేడియం, ముంబై)
- ఏప్రిల్ 23: సన్‌రైజర్స్ vs ముంబై ఇండియన్స్ (ఉప్పల్ స్టేడియం)
- ఏప్రిల్ 25: చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ (చెన్నై)
- మే 02: గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ (అహ్మదాబాద్)
- మే 05: సన్‌రైజర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ఉప్పల్ స్టేడియం)
- మే 10: సన్‌రైజర్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (ఉప్పల్ స్టేడియం)
- మే 13: బెంగళూరు vs సన్‌రైజర్స్ (బెంగళూరు)
- మే 18: లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ (లక్నో)
The moment you've all been waiting for 🧡
— SunRisers Hyderabad (@SunRisers) February 16, 2025
Mark your calendars, #OrangeArmy! It's time to #PlayWithFire 🔥#TATAIPL2025 pic.twitter.com/FTXpFMqFCg