2025 ఐపీఎల్ సీజన్ కోసం రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను అన్ని ఫ్రాంచైజ్‌లు వెల్లడించాయి. రిటెన్షన్ ప్లేయర్ల లిస్ట్‌ను విడుదల చేసేందుకు ఇవాళే (అక్టోబర్ 31) చివరి రోజు కావడంతో అన్ని జట్ల యజమాన్యాలు.. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు, వదిలేసుకున్న ప్లేయర్ల జాబితాను ప్రకటించాయి. దీంతో పాటుగా రిటెన్షన్ చేసుకున్న ఆటగాడికి ఎంత చెల్లించాయని వివరాలను సైతం ఫ్రాంచైజ్‌లు వెల్లడించాయి. రిటెన్షన్ పాలసీలో సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్ క్లాసెన్ జాక్ పాట్ కొట్టాడు.
గత సీజన్లో అద్భుత ప్రదర్శనతో సన్ రైజర్స్‌ను ఫైనల్‌కు చేర్చిన క్లాసెన్‌ను వచ్చే సీజన్ కోసం అట్టిపెట్టుకున్న ఎస్ఆర్హెచ్.. క్లాసెన్‌కు ఏకంగా రూ.23 కోట్లు చెల్లించనుంది. దీంతో రిటెన్షన్ పాలసీలో క్లాసెన్ టాప్ ప్లేయర్‌గా నిలిచాడు. టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని, జస్ప్రీత్ బుమ్రా, హర్ధిక్ పాండ్యాలను వెనక్కి నెట్టి రిటెన్షన్ పాలసీలో క్లాసెన్ అగ్రస్థానంలో నిలిచాడు.
విరాట్ కోహ్లీకి ఆర్సీబీ రూ.21 కోట్లు, రోహిత్‌కు ముంబై రూ.16 కోట్లు, ధోనీకి చెన్నై రూ.4 కోట్లు, పాండ్యా రూ.16.35, బుమ్రా రూ.18 కోట్లు ముంబై చెల్లించింది. లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లు చెల్లించి నికోలస్ పూరన్ వచ్చే సీజన్ కోసం అట్టిపెట్టుకుంది. దీంతో రిటెన్షన్ పాలసీలో ఎస్ఆర్హెచ్ విధ్వంసకర బ్యాటర్ టాప్‌లో నిలిచాడు. మొత్తానికి ఇవాళ్టితో జట్లు రిటెన్షన్ చేసుకునే ప్లేయర్లు ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. ఇక, ప్రియుల ఫోకస్ అంతా నవంబర్ చివరన లేదా డిసెంబర్లో జరగనున్న మెగా వేలంపై ఉండనుంది.