చెలరేగిన వివ్రాంత్..మయాంక్..సన్ రైజర్స్ భారీ స్కారు

చెలరేగిన వివ్రాంత్..మయాంక్..సన్ రైజర్స్ భారీ స్కారు

చివరి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. వాంఖడేలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్లో  20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు ఏకంగా 140 పరుగులు జోడించారు. అయితే 47 బంతుల్లో 2 సిక్సర్లు, 9 ఫోర్లతో 69 పరుగులు చేసిన వివ్రాంత్ శర్మ  ఆకాశ్ మధ్వల్ ఔట్ చేశాడు. వివ్రాంత్ ఔటైనా మయాంక్ అగర్వాల్ చెలరేగి ఆడాడు. సిక్సులు, ఫోర్లతో వాంఖడేను హోరెత్తించాడు. 46 బంతుల్లో 4 సిక్సర్లు, 8 ఫోర్లతో 83 పరుగులు చేశాడు. సెంచరీ దిశగా సాగుతున్న మయాంక్ ను మధ్వల్ పెవీలియన్ చేర్చాడు. 

చివర్లో టపటపా..

ఆరంభం అదుర్స్ అనిపించిన సన్ రైజర్స్..చివర్లో తుస్ మంది. వివ్రాంత్ శర్మ,  మయాంక్ అగర్వాల్ ఇద్దరు ఔటయ్యాక..సన్ రైజర్స్ స్కోరు మందగించింది. ఫిలిప్స్(1), బ్రూక్ (0) విఫలమయ్యారు. అయితే క్లాసెన్ (18), మార్కరమ్ (13) చివర్లో రాణించడంతో సన్ రైజర్స్ చివరకు 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో  ఆకాశ్ మధ్వల్ 4 వికెట్లు తీసుకున్నాడు. జోర్దాన్ ఒక వికట్ తీశాడు.