
హైదరాబాద్: ఐపీఎల్ 2025 షెడ్యూల్ (IPL 2025 Schedule) చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. లీగ్ మ్యాచ్ దశలో హైదరాబాద్ వేదికగా ఉప్పల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లేకపోవడం క్రికెట్అభిమానులకు, మరీ ముఖ్యంగా SRH ఫ్యాన్స్కు నిరాశ కలిగించింది. ఐపీఎల్ సీజన్ 18 షెడ్యూల్ ప్రకారం..లీగ్ దశలో ఆర్సీబీతో(Royal Challengers Bengaluru) గానీ, సీఎస్కేతో(Chennai Super Kings) గానీ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఒక్క మ్యాచ్ కూడా లేదు.
అందువల్ల.. ఉప్పల్లో జరిగే ఐపీఎల్ మ్యాచులకు వెళ్లే క్రికెట్ అభిమానులకు విరాట్ కోహ్లీని, ధోనీని చూసే అవకాశం లేదు. అయితే.. బెంగళూరు, చెన్నై జట్లు ఉప్పల్లో ఆడే అవకాశాలూ లేకపోలేదు. క్వాలిఫైయర్-1 మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్ కూడా హైదరాబాద్ ఉప్పల్ వేదికగానే జరగనున్నాయి. SRH, RCB, CSK.. ఈ మూడు జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తే ఉప్పల్ స్టేడియంలో SRHతో ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది.
ALSO READ | IPL 2025: హార్దిక్ పాండ్యాపై నిషేధం.. చెన్నైతో జరిగే మ్యాచ్‌కు దూరం
ధోనీ, కోహ్లీకి క్రికెట్ అభిమానుల్లో ఏ రేంజ్లో క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరినీ చూసే అవకాశం ఉంటుందని ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్లే తెలుగు జనం చాలామంది ఉన్నారు. అయితే.. లీగ్ దశలో జరిగే మ్యాచుల్లో SRH, RCB పోరు చూడాలంటే బెంగళూరుకు వెళ్లాల్సిందే. మే 13న బెంగళూరు చిన స్వామి స్టేడియం వేదికగా SRH, RCB మ్యాచ్ జరగనుంది. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్ తో SRH మ్యాచ్ చూసి మజా పొందాలనుకుంటున్న అభిమానులు ఏప్రిల్ 25న చెన్నైలోని చిదంబరం స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూడొచ్చు.
ఉప్పల్లో జరిగే అసలుసిసలు రసవత్తర పోరు ఎప్పుడంటే.. ఏప్రిల్ 23, 2025. ఏప్రిల్ 23న ఉప్పల్ స్టేడియం వేదికగా SRH, MI జట్లు తలపడనున్నాయి. రోహిత్ శర్మ టీంతో SRH మ్యా్చ్.. అదీ మన హైదరాబాద్లో. క్రేజ్ మాములుగా ఉంటుందా మరి.. కచ్చితంగా ఈ మ్యాచ్కు SRH అభిమానులతో పాటు ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా భారీగా తరలివెళ్లడం ఖాయం.