సొంతగడ్డపై సన్‌రైజర్స్ బ్యాటర్లు విలయతాండవం చేశారు. తమదే గొప్ప బౌలింగ్ లైనప్ అని విర్రవీగే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను తునాతునకలు చేశారు. సీఎస్‌కే నిర్ధేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 18.1 ఓవర్లలోనే ఛేదించింది. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ(37; 12 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. ఐడెన్ మార్క్రామ్(50; 36 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్), ట్రావిస్ హెడ్(31; 24 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) జోడి ఆ జోరును అలానే కొనసాగించారు. హైదరాబాద్ బ్యాటర్ల బాదుడుకు చెన్నై బౌలర్ల దగ్గర సమాధానమే లేకపోయింది.
ఒకే ఓవర్లో 27 పరుగులు
166 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ తొలి రెండు ఓవర్లలోనే 35 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ బాదుడుకు.. ముకేశ్ చౌదరి వేసిన రెండో ఓవర్లో ఏకంగా 27 పరుగులు వచ్చాయి. ఆ మరుసటి ఓవర్‌లో 4, 6 బాదిన అభిషేక్.. భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. అక్కడినుండి మార్క్రామ్, హెడ్ ఆ బాధ్యతను తీసుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో హెడ్ ఔటైనా.. మార్క్రామ్ హాఫ్ సెంచరీ బాది జట్టుకు విజయాన్ని అందించాడు.
Abhishek Sharma's intent 👌pic.twitter.com/r932G4ts90
— CricTracker (@Cricketracker) April 5, 2024
రాణించిన దూబే
అంతకుముందు అజింక్యా రహానే(35; 30 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్), శివమ్ దూబే(45; 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించడంతో చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.
ఈ విజయంతో సన్‌రైజర్స్ జట్టు స్థానాలు నాలుగో స్థానానికి చేరుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
Happy Kavya Maran after the win. pic.twitter.com/hOCpeDeZsX
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 5, 2024