రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కగానొక్క ఐపీఎల్ జట్టు.. సైన్‌రైజర్స్ హైదరాబాదే. దేశం తరుపున ఆడుతున్నప్పుడు.. అభిమానం పరంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లను ఆదరించినప్పటికీ.. ఐపీఎల్‌కు వచ్చేసరికి తెలుగు జట్టుకే ఓటెయ్యాలి. గతంలో మన ఫ్యాన్స్ అలానే ఆదరించేవారు. కానీ, గత 24 గంటల్లో ఏం జరిగిందో కానీ, ఓటర్ల వలే అభిమానులు రూటు మార్చారు. ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు జరిగిన ఆరంజ్ రంగులో కనిపించే ఉప్పల్ స్టేడియం కాస్తా.. పసుపు రంగు మయం అయిపోయింది.
ధోని క్రేజ్
ధోనికిది చివరి ఐపీఎల్ కావడంతో అతన్ని ఆరాధించే అభిమానులంతా ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. దీంతో స్టాండ్స్ లో ఎటుచూసినా ఎల్లో జెర్సీ ధరించిన అభిమానులే కనిపిస్తున్నారు. మన జట్టు అని చెప్పుకోవడానికి ఆరంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అక్కడక్కడా కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
Dhoni 🤝 Jr NTR fans at Hyderabad for CSK vs SRH match. 🔥 pic.twitter.com/KTL9wgXCuX
— Johns. (@CricCrazyJohns) April 5, 2024
Hyderabad crowd going berserk on MS Dhoni entry. 🔥pic.twitter.com/BSxkU8uSLt
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 5, 2024
సన్‌రైజర్స్‌దే టాస్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ సారథి పాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సీఎస్‌కే మొదట బ్యాటింగ్ చేస్తోంది. మయాంక్ అగర్వాల్ అస్వస్థతకు గురికావడంతో అతని స్థానంలో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సన్‌రైజర్స్ జట్టులోకి వచ్చాడు.
ఇప్పటివరకూ ఇరు జట్లు మూడేసి మ్యాచ్‌లు ఆడగా.. చెన్నై రెండింటిలో.. సన్ రైజర్స్ ఒక దానిలో విజయం సాధించాయి. పాయింట్ల పట్టికలోమూడో స్థానంలో ఉండగా.. ఎస్ఆర్ హెచ్ ఏడో స్థానంలో ఉంది.