
గుజరాత్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ మళ్లీ ఓటమిపాలైంది. 153 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ను చిత్తు చేసింది. ఈ ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ఇదివరుసగా నాల్గో ఓటమి.
గుజరాత్ బ్యాట్స్ మెన్ లలో శుభ్ మన్ గిల్ 61, వాషింగ్టన్ సుందర్ 49, రుథర్ ఫడ్ 35 పరుగులతో చెలరేగడంతో 153 పరుగుల లక్ష్యాన్ని 16.4 ఓవర్లలోనే చేధించింది. హైదరాబాద్ బౌలర్లలో షమీకి 2, పాట్ కమిన్స్ కు ఒక వికెట్ పడ్డాయి.
ALSO READ | SRHvsGT: 300 కాదు 152 కొట్టారు.. కాటేరమ్మ కొడుకులు మళ్లీ ఫెయిల్.. SRH గెలవాలంటే..
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేసింది. నితీశ్ రెడ్డి 31,క్లాసెన్ 27, కమిన్స్ 22 పరుగులు మినహా మిగతా వారెవరూ పెద్దగా రాణించలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో చెలరేగాడు. ప్రసిద్ ,సాయి కిషోర్ లకు తలో రెండు వికెట్లు పడ్డాయి.