
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. వరుసగా మూడు పరాజయాలతో డీలా పడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై తిరిగి గెలుపు బాట పట్టాలని చూస్తోంది. ఈ మ్యాచ్ కు కీలక ఫేసర్ హర్షల్ పటేల్ గాయం కారణంగా మ్యాచ్ కు దూరమయ్యాడు. తుది జట్టులోకి జయదేవ్ ఉనద్కత్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడి మూడింటిలో ఓడిన సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో ఉంది.
భారీ అంచనాలు పెట్టుకున్న టాపార్డర్ బ్యాటర్ల ఫెయిల్యూర్ జట్టును దెబ్బతీస్తోంది. దూకుడు, అతి దూకుడుకు మధ్య సరైన బ్యాలెన్స్ లేక బ్యాటింగ్ యూనిట్ ఫెయిలవుతోంది. అదే సమయంలో బౌలర్లూ నిరాశపరుస్తున్నారు. స్పిన్నర్ జీషన్ అన్సారీ తప్పితే మిగతా బౌలర్లు ఎక్కువ రన్స్ ఇచ్చుకుంటున్నారు. మరోసారి ఓడితే రైజర్స్ మరింత ఆత్మరక్షణలో పడిపోతుంది. కాబట్టి ఓపెనర్లు అభిషేక్, హెడ్‌తో పాటు హిట్టర్లు ఇషాన్, క్లాసెన్ తమ మార్కు చూపెట్టాల్సిన అవసరం ఉంది.
కమిన్స్ నేతృత్వంలోని బౌలర్లు కూడా గాడిలో పడాల్సిందే. ఫీల్డింగ్‌లోనూ కమిన్స్‌సేన తక్షణమే మెరుగవ్వాలి. మరోవైపు వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని జీటీ హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసింది. బ్యాటింగ్‌లో సుదర్శన్, జోస్ బట్లర్ జోరు మీద ఉండగా.. బౌలింగ్‌లో హైదరాబాదీ సిరాజ్, అర్షద్, సాయి కిశోర్ సత్తా చాటుతున్నారు.
జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(c), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(w), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ