
గుజరాత్ తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ మూడు వికెట్లు కోల్పోయింది. 50 పరుగుల దగ్గర ఇషాన్ కిషన్ ఔటయ్యాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఓపెనర్స్ ను తక్కువ స్కోరుకే సిరాజ్ పెవిలియన్ చేర్చాడు.
ఓపెనర్ అభిషేక్ శర్మ 18, హెడ్ 8 పరుగులకే ఔటయ్యారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి,హెన్రిచ్ క్లాసెన్ నిలకడగా ఆడుతున్నారు . 9 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో హెన్రిచ్ క్లాసెన్ 6, నితీశ్ రెడ్డి 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(c), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(w), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ