SRH vs HCA: పాత ఒప్పందం ప్రకారమే ముందుకెళ్తాం.. సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రకటన

SRH vs HCA: పాత ఒప్పందం ప్రకారమే ముందుకెళ్తాం.. సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రకటన

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకున్నట్టు సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రకటించాయి. మంగళవారం (April 1) ఉప్పల్ స్టేడియంలో హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ సెక్రటరీ ఆర్. దేవరాజ్ నేతృత్వంలో  సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధులు కిర‌‌‌‌‌‌‌‌ణ్‌‌‌‌‌‌‌‌, శ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌, రోహిత్ చర్చలు జరిపారు. ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్ సీఈవో షణ్ముగం ఫోన్‌‌‌‌‌‌‌‌ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు. 

హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ జగన్ దూరంగా ఉన్న ఈ భేటీలో  బీసీసీఐ, ఎస్ఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ట్రై పార్టీ ఒప్పందం మేర‌‌‌‌‌‌‌‌కు ప‌‌‌‌‌‌‌‌ని చేసేందుకు ఇరు వ‌‌‌‌‌‌‌‌ర్గాలు అంగీకారం తెలిపాయి. పాత ఒప్పందం ప్రకారమే స్టేడియం సామ‌‌‌‌‌‌‌‌ర్థ్యంలోని 10 శాతం  కాంప్లిమెంట‌‌‌‌‌‌‌‌రీ పాసుల కేటాయింపును ఒప్పుకున్నాయి. 

ఉప్పల్ స్టేడియంలో  ఐపీఎల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను విజ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌వంతంగా నిర్వహించేందుకు స‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌రిస్తామ‌‌‌‌‌‌‌‌ని సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ హామీ ఇచ్చింది. కాగా, బుధవారం సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం.