
కోల్‌కతా: తొలి మ్యాచ్‌లో రికార్డు బ్రేకింగ్ పెర్ఫామెన్స్ చేసి తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలతో డీలా పడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో కీలక మ్యాచ్‌కు రెడీ అయ్యింది. గురువారం (ఏప్రిల్ 3) జరిగే నాలుగో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. అల్ట్రా అటాకింగ్ బ్యాటింగ్‌తో భారీ స్కోర్లుపై దృష్టి పెడుతున్న హైదరాబాద్ దాన్ని కాపాడుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. దీంతో కమిన్స్ నేతృత్వంలోని బౌలింగ్ బృందం తమ వ్యూహాలు మరోసారి పునఃపరిశీలించుకోవాలని భావిస్తోంది.
పేసర్ మహ్మద్ షమీకి ఈడెన్ గార్డెన్ సొంత మైదానం కావడంతో కచ్చితంగా ప్రభావం చూపుతాడని అంచనా వేస్తున్నారు. అదే టైమ్‌లో కమిన్స్ కూడా చెలరేగితే బౌలింగ్ కష్టాలు తీరినట్లే. హర్షల్ పటేల్, జంపా కూడా గాడిలో పడాల్సి ఉంది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డిలో ఏ ఇద్దరు రాణించినా భారీ స్కోరును ఆశించొచ్చు. ఓవరాల్‌గా గత ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు హైదరాబాద్ రెడీ అవుతుండగా అదే రిజల్ట్‌ను కంటిన్యూ చేయాలని కేకేఆర్ లక్ష్యంగా పెట్టుకుంది.