ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం(మే 08) సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో లక్నో సారథి కేఆర్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు భారీ మార్పులు చేశాయి. వనిందు హసరంగా స్థానంలో హైదరాబాద్ జట్టులోకి వచ్చిన విజయకాంత్ ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగ్రేటం చేయనున్నాడు.
ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. సన్‌రైజర్స్.. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనుకుంటే గెలవక తప్పదు. ఇందులో గెలిస్తే 14 పాయింట్లతో టోర్నమెంట్‌లో ముందుడుగు వేయొచ్చు. ఇప్పటివరకూ ఆడిన 11 మ్యాచ్‌లల్లో ఆరింట నెగ్గిన హైదరాబాద్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
తుది జట్లు
సన్‌రైజర్స్: ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్.
లక్నో: క్వింటన్ డి కాక్, కేఎల్ రాహుల్(కెప్టెన్/ వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్.