సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్లు ముంబై బౌలర్లకు చుక్కలు చూపెడుతున్నారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు భారీ సిక్సులతో విధ్యంసం సృష్టించారు. పవర్ ప్లేలో ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు హెడ్. ఈ ఆసీస్ స్టార్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. హెడ్ ఊపుతో మొదటి 7 ఓవర్లలోనే సన్ రైజర్స్ వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది. ఈ క్రమంలో భారీ షాట్ యత్నించి హెడ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. ధనాధన్ ఇన్నింగ్స్ తో స్టేడియాన్ని హోరిత్తించాడు. కేవలం 16 బంతుల్లోనే అర్థ శతకం బాదాడు. అనంతర బిగ్ షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు అభిషేక్. మొత్తం 23 బంతులు ఎదుర్కొన్న అతను 7 సిక్సులు, 3ఫోర్లతో 63 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్ మెన్ గా అభిషేక్ నిలిచాడు.
Also Read: హెడ్ వీర ఉతుకుడు.. 7 ఓవర్లలోనే సన్ రైజర్స్ సెంచరీ
అభిషేక్ సునామీ ఇన్నింగ్స్ హైదరాబాద్ స్కోరు బోర్డు జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టింది. ప్రస్తుతం సన్ రైజర్స్ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి.. 174 పరుగలు చేసింది. క్రీజులో మార్ క్రమ్ 22 పరగులు, క్లాసెస్ 10 పరుగులతో ఆడుతున్నారు.