సొంత ఇలాకాలో పంజాబ్ తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించింది. కింగ్స్ బ్యాటర్లు నిర్ధేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. త్రిపాఠి(33) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. అభిషేక్(66) ఆ జోరును అలానే కొనసాగించాడు. వీరిద్దరూ వెనుదిరిగాక నితీష్ రెడ్డి(37), క్లాసెన్ (42) ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఈ గెలుపుతో ఆరంజ్ ఆర్మీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. అర్షదీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే ట్రావిస్ హెడ్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత రాహుల్ త్రిపాఠి (33; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు మెరుపులు మెరిపించాడు. అనంతరం దూకుడుగా ఆడే ప్రయత్నంలో హర్షల్ పటేల్ బౌలింగ్ లో త్రిపాఠి వెనుదిరగ్గా.. క్రీజులోకి వచ్చిన నితీశ్ రెడ్డి (37; 25 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్స్‌లు) నిలకడగా ఆడాడు. అదే సమయంలో మరో ఎండ్‌లో అభిషేక్(66; 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) బౌండరీల వర్షం కురిపించాడు.
🎥 Relief for Punjab kings as they get the danger man!
— IndianPremierLeague (@IPL) May 19, 2024
Abhishek Sharma goes back after scoring a thrilling 66 off just 28 balls 👏
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #SRHvPBKS pic.twitter.com/eC9f3A7Qeh
దెబ్బకొట్టిన శశాంక్ సింగ్
అభిషేక్ కొట్టుడుకు మ్యాచ్ త్వరగా ముగిసేలా కనిపించింది. ఆ సమయంలో పార్ట్ టైమ్ బౌలర్ శశాంక్ సింగ్ దెబ్బకొట్టాడు. ప్రమాదకర అభిషేక్ (66; 28 బంతుల్లో) పెవిలియన్ చేర్చాడు. అయినప్పటికి.. పంజాబ్ కు ఊరట దక్కలేదు. క్రీజులోకి వచ్చిన క్లాసెన్ (42; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ సిక్సర్లతో అలరించాడు. అయితే చివరి ఓవర్లలో పంజాబ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో మ్యాచ్ పూర్తవ్వడానికి సమయం పట్టింది. చివరలో ఆరంజ్ ఆర్మీ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
రాణించిన పంజాబ్ బ్యాటర్లు
అంతకుముందు ఉప్పల్ గడ్డపై పంజాబ్ బ్యాటర్లు భారీ స్కోరు బాదారు. ప్రభసిమ్రాన్ సింగ్(71; 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకం బాదగా.. అథర్వ తైడే(46; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిలీ రోసో(49; 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), జితేశ్ శర్మ (32 నాటౌట్; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2, కమిన్స్, విజయ్‌కాంత్ వియస్కాంత్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Sunrisers have done their bit for second spot - now they wait for the completion of the league stage #SRHvPBKS #IPL2024
— ESPNcricinfo (@ESPNcricinfo) May 19, 2024
👉 https://t.co/7goUgInLd6 pic.twitter.com/SsFPuT2QK3