SRH vs GT: ఎస్ఆర్‎హెచ్‎ ఓటమికి కారణం అదే.. కుల్లంకుల్లా చెప్పేసిన అంబటి రాయుడు

SRH vs GT: ఎస్ఆర్‎హెచ్‎ ఓటమికి కారణం అదే.. కుల్లంకుల్లా చెప్పేసిన అంబటి రాయుడు

ఐపీఎల్ 18వ సీజన్‎లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ అట్టర్ ప్లాఫ్ షో చేస్తోంది. రికార్డ్ విజయంతో లీగును ఆరంభించిన ఎస్ఆర్‎హెచ్ ఆ తర్వాత వరుస ఓటములను మూటగట్టుకుంది. లీగులో ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడిన హైదరాబాద్.. వరుసగా నాలుగింట్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి చేరుకుంది. లీగ్ ప్రారంభంలో ఒక్క మ్యాచ్ గెలిచిన ఎస్ఆర్‎హెచ్ మళ్లీ ఆ తర్వాత గెలిపు రుచిచూడలేదు. 

పరుగుల వరద పారించే తమ హోంగ్రౌండ్లో కూడా ఎస్ఆర్‎హెచ్ బ్యాటర్స్ రన్స్ చేయడానికి తడబడుతున్నారు. ఆదివారం (ఏప్రిల్ 7) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‎తో జరిగిన మ్యాచులోనూ ఎస్ఆర్‎హెచ్ ఘోర ఓటమి పాలైంది. 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్‎ను చిత్తు చేసింది గిల్ సేన. ఈ క్రమంలో ఎస్ఆర్‎హెచ్ వరుస ఓటములపై తెలుగు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. 

ALSO READ | ఆర్సీబీతో కీలక పోరు.. ముంబైకి రెండు గుడ్ న్యూస్‎లు

ఓ స్పోర్ట్స్ ఛానెల్‎తో మాట్లాడుతూ.. ఎస్ఆర్‎హెచ్ బ్యాటింగ్‎కు ఎలాంటి డోకా లేదు.. సరైన బౌలింగ్ లైనప్ లేకపోవడం వల్లే హైదరాబాద్ వరుస ఓటములను చవిచూడాల్సి వస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ జట్టులో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టగలిగే బౌలర్లే లేరని.. ఇదే వారి ఓటములకు ప్రధాన కారణమని కుల్లంకుల్లా చెప్పారు. గుజరాత్ టైటాన్స్‎లో సాయి కిషోర్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ ఎలా రాణించారో చూశాం.. మిడిల్ ఓవర్లలో ఈ ముగ్గురు ఎస్ఆర్‎హెచ్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టి పరుగులు రాకుండా కట్టడి చేశారని అన్నారు.

ఎస్ఆర్‎హెచ్ వికెట్లు తీయగల జట్టులా కనిపించడం లేదు.. వాళ్లు బ్యాట్స్‌మన్ బౌండరీ కొట్టకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. మిడిల్ ఓవర్లలో రాణించే బౌలర్లు లేకుండా ఐపీఎల్ ట్రోఫీ గెలవడం కష్టమని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచులు ఓడిన హైదరాబాద్.. నెక్ట్స్ మ్యాచ్ ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచులోనైనా గెలుస్తారా.. లేదా ఓటముల పరంపరను కొనసాగిస్తారో చూడాలి మరీ.