హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం బెటర్.. డైరెక్టర్ కృష్ణవంశీ పోస్ట్ వైరల్

హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం బెటర్.. డైరెక్టర్ కృష్ణవంశీ పోస్ట్ వైరల్

హనుమాన్(HanuMan) మూవీ వీర విహారం ఇంకా తగ్గడం లేదు. విడుదలై నెలరోజులు గడుస్తున్నా.. మంచి కలెక్షన్స్ రాబడుతోంది ఈ మూవీ. క్రియేటీవ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. జనవరి 12 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. విడుదలైన ప్రతీ చోట రికార్డ్ కలెక్షన్స్ రాబట్టి సాలిడ్ హిట్ గా నిలిచింది ఈ మూవీ.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ. ఈ దర్శకుడు గతంలో హనుమాన్ కాన్సెప్ట్ తో శ్రీ ఆంజనేయం అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. నితిన్, చార్మీ జంటగా డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ అవలేదు. నిజానికి హీరోయిన్ ఛార్మి పార్ట్ మినహాయిస్తే శ్రీ ఆంజనేయం సినిమా చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ సినిమాను చాలా ఇష్టపడతారు. కృష్ణవంశీ విజన్, గ్రాఫిక్స్, వీఎఫెక్స్, మ్యూజిక్ అన్ని అద్భుతంగా ఉంటాయి. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. 

అయితే తాజాగా ఒక నెటిజన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. హనుమాన్ సినిమా కంటే నాకు శ్రీ ఆంజనేయం సినిమానే బాగా నచ్చింది. పిచ్చినాకొడుకులకి అర్థం కాలేదు.. అంటూ దర్శకుడు కృష్ణవంశీని ట్యాగ్ చేస్తూ మెసేజ్ పెట్టారు. దానికి బదులిచ్చిన కృష్ణవంశీ.. ప్రేక్షకులు ఎప్పుడూ తప్పు చేయరు. వారికి నచ్చలేదు అంటే అందులో ఎదో పొరబాటు ఉండే ఉంటుంది. సినిమాలో నేను కూడా కొన్ని పోర్షన్లలో తప్పు చేసి ఉండవచ్చు. కాబట్టి ప్రేక్షకులను నిందించడం కరక్ట్ కాదు. థాంక్ యూ.. గాడ్ బ్లెస్.. అంటూ రాసుకొచ్చాడు. దీంతో దర్శకుడు కృష్ణవంశీ చేసిన ఈ ట్వీట్ ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.