
హైదరాబాద్, వెలుగు: శ్రీ చైతన్య అకాడమీ కొత్త టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్‌ను హైదరాబాద్ లోని సుచిత్రలో ప్రారంభించింది. దీనిని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ కేంద్రంలో జేఈఈ మెయిన్, అడ్వాన్స్ డ్, నీట్ వంటి పరీక్షలకు నాణ్యమైన ప్రిపరేషన్‌ను అందించనున్నారు.
ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థల సీఈవో, డైరెక్టర్ సుష్మా బొప్పన మాట్లాడుతూ.. ఐఐటీ జేఈఈ, నీట్ వంటి పరీక్షలలో రాణించాలనుకునే స్టూడెంట్లకు అవసరమైన శిక్షణను అందించడానికి హైదరాబాద్ లో తమ టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్ ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఇన్ఫినిటీ లెర్న్ వ్యవస్థాపక సీఈవో ఉజ్వల్ సింగ్ మాట్లాడుతూ..ప్రతి విద్యార్థి కలలను సాకారం చేసేందుకు తమ బోధన విధానం సహాయం చేస్తున్నదని వివరించారు.