ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య జయభేరి

ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య జయభేరి

హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో శ్రీచైతన్య జయభేరి మోగిం చింది. జూనియర్ ఇంటర్​లో ఎంపీసీలో 470 మార్కులకు 103 మందికి 468 మార్కులు వచ్చాయని, 462 మంది స్టూడెంట్లు 467 మార్కులు పొందారని శ్రీచైతన్య విద్యా సంస్థల అకాడమిక్  డైరెక్టర్  సుష్మశ్రీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

జూనియర్  ఇంటర్  బైపీసీలో 440 మార్కులకు 26 మందికి 438 మార్కులు వచ్చాయని, 136 మంది 437 మార్కులు సాధించారని ఆమె వివరించారు. సీనియర్ ఇంటర్​లో వెయ్యి మార్కులకు 996  మార్కులు సాధించారని, ఏడుగురికి 995 మార్కులు వచ్చాయని చెప్పారు. 46 మంది విద్యార్థులు 994 మార్కులు పొందారని, 610 మంది 990 మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు, లెక్చరర్లు, తల్లిదండ్రులను ఆమె అభినందించారు.