
తెలుగు రాష్ట్రాలకు అరుదౌన గౌరవం దక్కింది. గతంలో బాసర దేవాలయంలో ఋగ్వేద పండితుడిగా పారాయణం చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం ఆలయాంలో చెందిన ఋగ్వేద పండితుడిగా ఉన్న దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ ను 71 వ కంచిపీఠాధిపతిగా శ్రీశంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఎంపిక చేశారు. ఈ క్రమంలో అక్షయ తృతీయ రోజున అంటే ఏప్రిల్30న కామాక్షి ఆలయంలో దుడ్డు గణేష్ శర్మకు ఆయన సన్యాస దీక్షను ఇవ్వనున్నారు.
కాంచీ పీఠం సంప్రదాయం ప్రకారం.. ప్రస్తుత పీఠాధిపతిచే సన్యాసం స్వీకరించిన శిష్యుడిని అతని వారసుడిగా ఎన్నుకుంటారు. అంటే భవిష్యత్తులో దుడ్డు గణేష్ శర్మ కంచి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అప్పటి వరకు ఆయన ఉత్తరాధికారిగా ఉంటారు.
2006లో వేద విద్యను ప్రారంభించినప్పటి నుంచి శ్రీ కంచి కామకోటి పీఠానికి చెందిన శంకరాచార్య స్వామివారి ఆశీస్సులు పొందారు. దుడ్డు ధన్వంతరి, మంగాదేవి దంపతుల పెద్ద కుమారుడైన సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ 1998లో జన్మించారు. 2006 లో వేద విద్య దీక్షను స్వీకరించిన తరువాత ద్వారకా తిరుమల ఆలయంలో వేద విద్యను అభ్యసించారు.
ఋగ్వేదంతో పాటు, ద్రావిడ్ యజుర్వేదం, సామవేదం, షడాంగాలు, దశోపనిషత్ కూడా పూర్తి చేసి, శాస్త్రోక్తమైన అధ్యయనాలను చేస్తున్నారు. ఇప్పటికూ గఫేష్ శర్మకు సన్యాస దీక్ష ఇచ్చేందుకు మందు జరగాల్సిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కాంచీపురంలో జరిగే ఈ వేడుక ( ఏప్రిల్ 30) ఉదయం నుంచి కామకోటి టీవీలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.