
సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ 2022 నవంబర్, డిసెంబర్ నెలల్లో సర్టిఫికేట్ ట్రైనింగ్ కోర్సులో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
కోర్సులు: మేనేజ్‌మెంట్ ఆఫ్ ఆయిల్‌పాం ఆర్కార్డ్స్‌పై సర్టిఫికెట్ ట్రైనింగ్ కోర్సుకు ఆఫ్‌లైన్‌లో డిసెంబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పదోతరగతి ఉత్తీర్ణతతో కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. శిక్షణ ఫీజు రూ.2500 ఉంటుంది.
ల్యాండ్‌స్కేప్ మెయింటెనెన్స్‌పై సర్టిఫికెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు డిసెంబర్ 2 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. శిక్షణ ఫీజు రూ.2500 చెల్లించాలి.
కిచెన్/ రూఫ్ గార్డెనింగ్(వెజిటబుల్ క్రాప్స్)పై సర్టిఫికెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు నవంబర్ 30 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. ట్రైనింగ్ ఫీజు రూ.2500 చెల్లించాలి. టీచింగ్ తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. పూర్తి వివరాలకు www.skltshu.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.