ట్రావెల్ బస్సు దగ్ధం.. ఒకరు సజీవ దహనం

నల్గొండ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మర్రిగూడ దగ్గర ఏసీ డెమో బస్సు నుంచి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. 

38 మంది ప్రయాణికులతో నిన్న(డిసెంబర్ 03) రాత్రి హైదరాబాద్ నుంచి శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు నెల్లూరుకు బయలుదేరింది. నల్గొండ జిల్లా మర్రిగూడ దగ్గరకు రాగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ప్రయాణికులు బస్సు నుంచి దిగి బయటకు పరుగులు తీశారు. కానీ ఒకరు మంటల్లో ఇరుక్కొని స్పాట్ లోనే కాలిపోయి.. ప్రాణాలు విడిచారు.

మరికొందరికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.