సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలోని నంబులాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జాతరకు హాజరయ్యే భక్తుల కోసం ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్వామిని దర్శించుకున్నారు.
పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. జడ్పీటీసీ స్వరూప, ఎంపీపీ బాలాజీ రావు, ఉత్సవ కమిటీ చైర్మన్ అట్ల కుమార్, లీడర్లు అన్నయ్య గౌడ్, డి.దామోదర్ రావు, మహేందర్, శ్రీగిరి శ్రీనివాస్, అబ్బయ్య గౌడ్, సతీశ్ లీడర్లు పాల్గొన్నారు.