ODI World Cup 2023: శ్రీలంకను కట్టడి చేసిన ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే..?

ODI World Cup 2023: శ్రీలంకను కట్టడి చేసిన ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు.. టార్గెట్ ఎంతంటే..?

వరల్డ్ కప్ లో నేడు మరో కీలక పోరు జరుగుతుంది. ఆసియా దేశాలైన శ్రీలంకతో ఆఫ్ఘనిస్తాన్ తలపడుతుంది. సెమీస్ రేస్ లో ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో లంక బ్యాటర్లు తడబడ్డారు. పూణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఒక మాదిరి స్కోర్ కే పరిమితమై మెండీస్ సేన.. బౌలర్లపైనే భారం వేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఏ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయకపోగా.. అందరూ తలో చేయి వేసి జట్టుకు డీసెంట్ టోటల్ అందించారు. ఓపెనర్ నిస్సంక 46 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కుశాల్ మెండిస్(39), సుధీర సమర విక్రమే(36), తీక్షణ(29) పర్వాలేదనిపించారు.  అసలంక 22 పరుగులు, సీనియర్ బ్యాటర్ మ్యాథూస్ 23 పరుగులు చేసినా వాటిని భారీ స్కోర్లు గా మలచడంలో విఫలమయ్యారు. 

ఒక దశలో 2 వికెట్లకు 134 పరుగులు చేసిన శ్రీలంక పటిష్టంగానే కనిపించింది. అయితే ఆఫ్ఘన్ బౌలర్లు రెచ్చిపోవడంతో చివరి 8 వికెట్లను 107 పరుగులకే కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్ ఫరూఖీ 4 వికెట్లు తీసుకోగా.. ముజీబ్ కు రెండు వికెట్లు దక్కాయి. రషీద్ ఖాన్, ఓమర్జాయ్ కు తలో వికెట్ లభించింది.