లంక కూలింది..77 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌట్

లంక కూలింది..77 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌట్
  •      చెలరేగిన పేసర్ అన్రిచ్
  •      6 వికెట్లతో సౌతాఫ్రికా గెలుపు

న్యూఢిల్లీ : మాజీ చాంపియన్ శ్రీలంక టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ను అత్యంత పేలవంగా ఆరంభించింది. పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హిట్టింగ్‌‌‌‌‌‌‌‌ హవా నడుస్తున్న ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో  సౌతాఫ్రికా పేసర్ అన్రిచ్ నార్జ్‌‌‌‌‌‌‌‌ (4–0–7–4) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ ధాటికి లంక పేకమేడలా కూలింది. బ్యాటర్లంతా నిరాశ పరిచిన వేళ 77 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైన శ్రీలంక టీ20ల్లో తన అత్యల్ప స్కోరు నమోదు చేసింది. దాంతో సోమవారం రాత్రి జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–డి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌ 6 వికెట్ల తేడాతో  లంకను చిత్తుగా ఓడించి బోణీ చేసింది. తొలుత లంక 19.1 ఓవర్లలో 77 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది.

కుశాల్ మెండిస్ (30 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌19), ఏంజెలో మాథ్యూస్ (16 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లతో 16), కమిందు మెండిస్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మరో పేసర్  కగిసో రబాడ,  స్పిన్నర్ కేశవ్ మహారాజ్‌‌‌‌‌‌‌‌ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌ 16.2 ఓవర్లలో 80/4 స్కోరు చేసి గెలిచింది. డికాక్ (20), క్లాసెన్ (19 నాటౌట్‌‌‌‌‌‌‌‌) రాణించారు.  అన్రిచ్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

పేకమేడలా..

టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు ఎంచుకున్న లంక కెప్టెన్ హసరంగ నిర్ణయం బెడిసికొట్టింది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు అనుకూలిస్తున్న వికెట్‌‌‌‌‌‌‌‌పై ఆ టీమ్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ సైకిల్ స్టాండ్‌‌‌‌‌‌‌‌ను తలపించింది. ఒక్కరు కూడా స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయారు. మరోవైపు సఫారీ పేసర్లు మార్కో జాన్సెన్‌‌‌‌‌‌‌‌, రబాడ, అన్రిచ్‌‌‌‌‌‌‌‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేశారు. నాలుగో ఓవర్లో బౌలింగ్‌‌‌‌కు వచ్చిన బార్ట్‌‌‌‌మన్ వరల్డ్ కప్‌‌‌‌లో తన తొలి బాల్‌‌‌‌కే ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాథుమ్ నిశాంక  (3)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి లంక పతనాన్ని ఆరంభించాడు.  సఫారీ పేసర్ల ధాటికి  పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేలో రెండే ఫోర్లు రాబట్టిన లంక 24/1తో నిలిచింది.

ఫీల్డింగ్ మారిన తర్వాత ఆ టీమ్ ఆట మారలేదు. అన్రిచ్‌‌‌‌‌‌‌‌ వేసిన ఎనిమిదో ఓవర్లో భారీ షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసిన కమిందు... హెండ్రిక్స్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు.  ఆవెంటనే  కెప్టెన్‌‌‌‌‌‌‌‌ హసరంగ (0)ను స్టంపౌట్‌‌‌‌‌‌‌‌ చేసిన స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌  తర్వాతి బాల్‌‌‌‌‌‌‌‌కే సదీర సమరవిక్రమ (0)ను క్లీన్‌‌‌‌‌‌‌‌ బౌల్డ్ చేశాడు. కాసేపు ప్రతిఘటించిన కుశాల్ మెండిస్‌‌‌‌‌‌‌‌ను పదో ఓవర్లో అన్రిచ్ వెనక్కుపంపడంతో లంక 40/5తో కష్టాల్లో పడింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా  జట్టును ఆదుకోలేకపోయారు. అన్రిచ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనే అసలంక (6) హెండ్రిక్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు.

ఈ దశలో ఏంజెలో మాథ్యస్‌‌‌‌‌‌‌‌ రెండు, షనక (9) ఓ సిక్స్‌‌‌‌‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు చలనం తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, రబాడ వేసిన 15వ ఓవర్లో మరో షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి షనక బౌల్డ్ అవ్వగా.. అన్రిచ్ షార్ట్ బాల్‌‌‌‌‌‌‌‌కు మాథ్యూస్ ఫైన్ లెగ్‌‌‌‌‌‌‌‌లో బార్ట్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు. రబాడ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో పతిరణ (0) డకౌటవ్వగా.. నువాన్ తుషార (0)  చివరి ఓవర్ తొలి బాల్‌‌‌‌‌‌‌‌కు రనౌటవ్వడంతో లంక ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. 

సఫారీలూ తడబడుతూనే

చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికా సైతం తడబడింది. ఆ టీమ్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ సైతం చప్పగా సాగింది. లంక కూడా మెరుగ్గానే బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసినా టార్గెట్‌‌‌‌‌‌‌‌ మరీ చిన్నది కావడంతో ఓటమి తప్పించుకోలేకపోయింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ రీజా హెండ్రిక్స్‌‌‌‌‌‌‌‌ (4)ను నువాన్ తుషార ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి లంకకు బ్రేక్ ఇచ్చాడు.  తుషార ఓవర్లో సిక్స్ కొట్టిన మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్ (12) షనక బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో పెవిలియన్ చేరడంతో సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌ 23/2తో నిలిచింది.

అదే ఓవర్లో స్టబ్స్‌‌‌‌‌‌‌‌ (13) ఇచ్చిన క్యాచ్‌‌‌‌‌‌‌‌ను కుశాల్ మెండిస్‌‌‌‌‌‌‌‌ డ్రాప్‌‌‌‌‌‌‌‌ చేశాడు. అప్పటికి ఖాతా తెరవని స్టబ్స్ క్రీజులో కుదురుకున్న డికాక్‌‌‌‌‌‌‌‌కు కాసేపు సపోర్ట్ ఇచ్చాడు. మాథ్యూస్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టిన డికాక్ తర్వాత నెమ్మదించాడు. 11వ ఓవర్లో హసరంగకు రిటర్న్‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి మూడో వికెట్‌‌‌‌‌‌‌‌గా వెనుదిరిగాడు. కాసేపటికే స్టబ్స్‌‌‌‌‌‌‌‌నూ హసరంగ ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు.కానీ అతని బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనే  క్లాసెన్  6, 4 కొట్టగా..  మిల్లర్ (6 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్ ముగించాడు. 

77 టీ20ల్లో లంకకు ఇదే అత్యల్ప స్కోరు. 2016లో వైజాగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 82 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది.

సంక్షిప్త స్కోర్లు

శ్రీలంక : 19.1 ఓవర్లలో 77 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (కుశాల్ మెండిస్ 19, మాథ్యూస్ 16, అన్రిచ్ 4/7, రబాడ 2/21)
సౌతాఫ్రికా : 16.2 ఓవర్లలో 80/4 (డికాక్‌‌‌‌‌‌‌‌ 20, క్లాసెన్ 19*, హసరంగ 2/22)