అక్టోబరు 3 నుంచి బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు అర్హత సాధించాయి. ఆదివారం(మే 5) జరిగిన క్వాలిఫయర్ సెమీస్‌లో స్కాట్లాండ్.. ఐర్లాండ్‌ను ఓడించి ప్రపంచకప్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరో పోరులో శ్రీలంక.. యూఏఈని ఓడించి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
స్కాట్లాండ్ 2015 నుండి ప్రపంచ కప్‌కు అర్హత సాధించాలని ప్రయత్నిస్తోంది. చివరకు ఐదో ప్రయత్నంలో (2015, 2018, 2019, 2022, 2024) వారు తమ లక్ష్యాన్ని సాధించారు. బలమైన ఐర్లాండ్ ను ఓడించిన అనంతరం.. స్కాట్లాండ్ డగౌట్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి.
So much hard work, over so many years.
— Cricket Scotland (@CricketScotland) May 5, 2024
This is what it means 🏴
An unbelievable effort from this group 💜#FollowScotland pic.twitter.com/CrZDQR9iYj
అక్టోబర్ 3 నుంచి 20 వరకూ బంగ్లాదేశ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 జరగనుంది. టోర్నీలో తలపడే 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశలో ప్రతి జట్టు నాలుగు గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇవి ముగిసేసరికి ప్రతి గ్రూప్ నుండి టాప్- 2లో నిలిచిన మొదటి రెండు జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. ఆరుసార్లు ప్రపంచ కప్ విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, భారత్, శ్రీలంక గ్రూప్- ఏలో ఉండగా.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు గ్రూప్- బిలో ఉన్నాయి. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్ – పాకిస్థాన్ అక్టోబర్ 6న జరగనుంది.
- గ్రూప్ ఏ: ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక
- గ్రూప్ బి: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్
మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్
- అక్టోబర్ 3: ఇంగ్లండ్ v దక్షిణాఫ్రికా (ఢాకా)
- అక్టోబర్ 3: బంగ్లాదేశ్ v స్కాట్లాండ్ (ఢాకా)
- అక్టోబర్ 4: ఆస్ట్రేలియా v శ్రీలంక (సిల్హెట్)
- అక్టోబర్ 4: భారత్ v న్యూజిలాండ్ (సిల్హెట్)
- అక్టోబర్ 5: దక్షిణాఫ్రికా v వెస్టిండీస్(ఢాకా)
- అక్టోబర్ 5: బంగ్లాదేశ్ v ఇంగ్లాండ్ (ఢాకా)
- అక్టోబర్ 6: న్యూజిలాండ్ v శ్రీలంక (సిల్హెట్)
- అక్టోబర్ 6: భారత్ వర్సెస్ పాకిస్థాన్ (సిల్హెట్)
- అక్టోబర్ 7: వెస్టిండీస్ v స్కాట్లాండ్ (ఢాకా)
- అక్టోబర్ 8: ఆస్ట్రేలియా v పాకిస్థాన్ (సిల్హెట్)
- అక్టోబర్ 9: బంగ్లాదేశ్ vs వెస్టిండీస్ (ఢాకా)
- అక్టోబర్ 9: భారత్ v శ్రీలంక (సిల్హెట్)
- అక్టోబర్ 10: దక్షిణాఫ్రికా v స్కాట్లాండ్ (ఢాకా)
- అక్టోబర్ 11: ఆస్ట్రేలియా v న్యూజిలాండ్ (సిల్హెట్)
- అక్టోబర్ 11: పాకిస్థాన్ v శ్రీలంక (సిల్హెట్)
- అక్టోబర్ 12: ఇంగ్లండ్ v వెస్టిండీస్ (ఢాకా)
- అక్టోబర్ 12: బంగ్లాదేశ్ v సౌతాఫ్రికా (ఢాకా)
- అక్టోబర్ 13: పాకిస్థాన్ v న్యూజిలాండ్ (సిల్హెట్)
- అక్టోబర్ 13: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (సిల్హెట్)
- అక్టోబర్ 14: ఇంగ్లాండ్ v స్కాట్లాండ్ (ఢాకా)
- అక్టోబర్ 17: సెమీ ఫైనల్ 1 (సిల్హెట్)
- అక్టోబర్ 18: సెమీ ఫైనల్ 2 (ఢాకా)
- అక్టోబర్ 20: ఫైనల్ (ఢాకా)