World Cup 2023: ఆ ఇద్దరు లేకుండానే వరల్డ్ కప్ పోరుకు శ్రీలంక

World Cup 2023: ఆ ఇద్దరు లేకుండానే వరల్డ్ కప్ పోరుకు శ్రీలంక

అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ పోరుకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టుని ప్రకటించింది. ఈ జట్టుకు దసున్ షనక కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండీస్‌కి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. గాయాల కారణంగా ఆ జట్టు కీలక ఆటగాళ్లు వహిందు హసరంగా, దుష్మంత చమీర ఈ టోర్నీకి దూరమయ్యారు.

శ్రీలంక వరల్డ్ కప్ జట్టు: దసున్ షనక (కెప్టెన్), కుసల్ మెండిస్ (వైస్ కెప్టెన్), పతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా (వికెట్ కీపర్), దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, సదీర సమరవిక్రమ (వికెట్ కీపర్), దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, దిల్షన్ మదుశంక, మతీష పతిరణ, లాహిరు కుమార.

రిజర్వ్ ప్లేయర్స్: చమిక కరుణరత్నే.

శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్‌ల షెడ్యూల్:

శ్రీలంక జట్టు.. సెప్టెంబర్ 29న బంగ్లాదేశ్‌తో, అక్టోబర్ 3న ఆఫ్ఘనిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం అక్టోబర్ 7న దక్షిణాఫ్రికాతో జరిగే తొలి మ్యాచ్‌తో లంకేయుల ప్రధాన మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి.

  • అక్టోబర్ 7: శ్రీలంక vs సౌతాఫ్రికా (ఢిల్లీ)
  • అక్టోబర్ 12: శ్రీలంక vs పాకిస్థాన్ (హైదరాబాద్)
  • అక్టోబర్ 16: శ్రీలంక vs ఆస్ట్రేలియా (లక్నో)
  • అక్టోబర్ 21: శ్రీలంక vs నెదర్లాండ్స్ (లక్నో)
  • అక్టోబర్ 26: శ్రీలంక vs ఇంగ్లండ్ (బెంగళూరు)
  • అక్టోబర్ 30: శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ (పూణే)
  • నవంబర్ 2: శ్రీలంక vs భారత్ (ముంబై)
  • నవంబర్ 6: శ్రీలంక vs బంగ్లాదేశ్ (ఢిల్లీ)
  • నవంబర్ 9: శ్రీలంక vs న్యూజిలాండ్ (బెంగళూరు)