జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు(SLC) తమ జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన పటిష్ఠమైన జట్టును మెగా టోర్నీకి ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్‌లో శ్రీలంక టీ20 కెప్టెన్‌గా ఎంపికైన హసరంగా పొట్టి ప్రపంచ కప్ సంగ్రామంలో జట్టును నడిపించనున్నాడు. అతని డిప్యూటీగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ చరిత్ అసలంక ఎంపికయ్యాడు.
లంకేయుల ప్రపంచ కప్ జట్టులో సీనియర్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్‌కు చోటు దక్కింది. మాథ్యూస్ టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనడం ఇది ఆరోసారి. జట్టు నిండా ఆల్‌రౌండర్లతో లంకేయులు బలంగానే ఉన్నారు. మాజీ పరిమిత ఓవర్ల కెప్టెన్ దసున్ షనకతో పాటు కుసాల్ మెండిస్ (ప్రస్తుత ODI కెప్టెన్), ధనంజయ డి సిల్వా (ప్రస్తుత టెస్ట్ కెప్టెన్) జట్టులో ఉన్నారు.
శ్రీలంక జట్టు: వనిందు హసరంగ (సి), చరిత్ అసలంక (విసి), కుసాల్ మెండిస్, పతుమ్ నిస్సంక, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డి సిల్వ, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, దుష్మంత చమీర, మతీషా పతిరణ, నువాన్ తుషార, దిల్షన్ మదుశంక.
ట్రావెలింగ్ రిజర్వ్‌లు: అసిత ఫెర్నాండో, విజయకాంత్ వియాస్కాంత్, భానుక రాజపక్సే, జనిత్ లియానాగే.
Here's your Sri Lankan squad ready to roar at the ICC #T20WorldCup 2024 in the USA and Caribbean! 🇱🇰
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) May 9, 2024
READ: https://t.co/9Zia3yVeVZ #LankanLions pic.twitter.com/ZresMKrIqg