SL vs NZ 2024: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్.. భారత్, ఆసీస్‌ను వణికిస్తున్న శ్రీలంక

SL vs NZ 2024: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్.. భారత్, ఆసీస్‌ను వణికిస్తున్న శ్రీలంక

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు మరో 8 నెలల సమయం మాత్రమే ఉంది. మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ భారత్, ఆసీస్ ఆడడం ఖాయమన్న దశలో శ్రీలంక ఈ రేస్ లోకి దూసుకొస్తోంది. లంక తమ సొంతగడ్డపై న్యూజిలాండ్ పై 2-0 తేడాతో ఘన విజయం సాధించి పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో నిలిచింది. తొలి టెస్ట్ గెలిచి మూడో స్థానంలో నిలిచిన లంక తమ విజయాల శాతాన్ని 55. 56 శాతానికి పెంచుకుంది. 

బంగ్లాదేశ్‌‌‌‌తో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. చెన్నై టెస్టులో విక్టరీ తర్వాత డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఇండియా  తన పర్సెంటేజ్ పాయింట్లను (పీటీసీ) 71.67 శాతానికి పెంచుకుంది.  రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (62.50 ) కంటే స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం కాన్పూర్ టెస్ట్ డ్రా అయ్యే అవకాశం ఉండడంతో గెలుపు శాతం తగ్గే అవకాశం కనిపిస్తుంది. 

ALSO READ | IND Vs BAN 2024: మూడో రోజ ముంచిన వర్షం.. డ్రా దిశగా కాన్పూర్ టెస్ట్

మరోవైపు శ్రీలంక పాయింట్స్ టేబుల్ లో ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉంది. దీంతో తొలి రెండు స్థానాల్లో ఎవరు నిలుస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియాలో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కీలకం కానుంది. న్యూజిలాండ్ (37.50) ఏకంగా ఏడో స్థానానికి పడిపోయింది. పాకిస్తాన్‌‌‌‌పై రెండు టెస్టుల సిరీస్‌‌‌‌ను క్లీన్‌‌‌‌స్వీప్‌‌‌‌ చేసిన తర్వాత నాలుగో స్థానానికి చేరుకున్న బంగ్లాదేశ్‌‌‌‌ (39.29 శాతం) ప్రస్తుతం ఐదో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌‌‌‌ (42.19) నాలుగో స్థానంలో ఉంది.