IPL ముగిశాకే లంక ప్రీమియర్ లీగ్.. డేట్స్ అనౌన్స్ చేసిన లంక క్రికెట్ బోర్డు

IPL ముగిశాకే లంక ప్రీమియర్ లీగ్.. డేట్స్ అనౌన్స్ చేసిన లంక క్రికెట్ బోర్డు

శ్రీలంక వేదికగా జరిగే లంక ప్రీమియర్ లీగ్ 5వ ఎడిషన్ జూలై 1 నుండి జూలై 21 వరకు జరగనున్నట్లు లంక క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. మొత్తం 5 జట్లు తలపడే ఈ టోర్నీలో.. 24 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 20 లీగ్ మ్యాచ్‌లు కాగా,  మిగిలిన నాలుగు క్వాలిఫైయర్ 1 & 2 మరియు ఎలిమినేటర్‌, ఫైనల్. లీగ్ దశలో ప్రతి జట్టు.. ఇతర జట్లతో రెండు సార్లు తలపడనుంది.

ప్రతి జట్టులో కనిష్టంగా 20 మంది, గరిష్టంగా 24 మంది ఆటగాళ్లకు లంక క్రికెట్ బోర్డు అనుమతిమిచ్చింది. వీరిలో ఆరుగురు విదేశీ ఆటగాళ్లకే మాత్రమే అనుమతి. భారత క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ముగిశాక ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. సరిగ్గా అదే సమయంలో మరో రెండు టీ20 లీగ్‌లు మేజర్ లీగ్ క్రికెట్, టీ20 బ్లాస్ట్‌ జరగనున్నాయి.

ఐపీఎల్ ఎప్పుడు..?

ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26న ప్రారంభమై మే 26న ముగిసేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అయితే, అందుకు మరో నెల మాత్రమే గడువున్నప్పటికీ.. స్పష్టత లేదు. ఈ ఏడాది భారత్‌లో సార్వత్రిక ఎన్నికల జరగనుండడంతో.. ఆ తేదీలొచ్చిన తర్వాత ఐపీఎల్‌ షెడ్యూల్‌ ప్రకటించనున్నారు. మరోవైపు, ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. వీటిని రెండు దఫాలుగా నిర్వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

లంక ప్రీమియర్ లీగ్ 2024 లో పాల్గొనే జట్లు

  • కొలంబో స్ట్రైకర్స్
  • దంబుల్లా ప్రకాశం
  • గాలే గ్లాడియేటర్స్
  • జాఫ్నా రాజులు
  • కాండీ ఫాల్కన్స్