కొత్త సెలక్షన్ కమిటీని ప్రకటించిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఛైర్మెన్‌గా మాజీ కెప్టెన్

కొత్త సెలక్షన్ కమిటీని ప్రకటించిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఛైర్మెన్‌గా మాజీ కెప్టెన్

శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. లంక జాతీయ జట్టును ఎంపిక చేసేందుకు కొత్త ‘క్రికెట్ సెలక్షన్ కమిటీ’ని ఏర్పాటు చేసినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు బుధవారం(డిసెంబర్ 13) ప్రకటించింది. రెండేళ్ల పాటు వీరు ఈ సెలక్షన్ కమిటీలో కొనసాగుతారు. కొత్త కమిటీ నియామకాన్ని తక్షణమే అమలు చేసేలా క్రీడా వ్యవహారాల మంత్రి హరీన్ ఫెర్నాండో తెలిపినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 
 
ఈ కమిటీకి శ్రీలంక మాజీ వన్డే కెప్టెన్ ఉపుల్ తరంగ అధ్యక్షత వహిస్తుండగా.. అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా సభ్యులుగా ఉంటారని తెలిపింది. తరంగ శ్రీలంక జట్టుకు విజయవంతమైన ఓపెనర్ గా నిలిచాడు. వన్డేల్లో జైసూర్యతో పాటు 286 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి తొలి వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పారు. జనవరి 6 నుంచి జింబాబ్వే వన్డే, టీ20 సిరీస్ కోసం శ్రీలంక పర్యటించనుంది. ఈ టూర్ కు శ్రీలంక జట్టును కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. 

స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న లంక క్రికెట్ బోర్డు విషయంలో ప్రభుత్వం జోక్యం కారణంగానే బోర్డును సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో నిర్వహించాల్సిన U-19, 2024 ప్రపంచ కప్‌ దక్షిణాఫ్రికా వేదికగా జరపనున్నట్లు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ తర్వాత ఐసీసీ.. లంక క్రికెట్ పై కొన్ని ఆంక్షలపై నిషేధం ఎత్తివేయడంతో ఆ జట్టు యధావిధిగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుకోవచ్చు.      

పర్యటన షెడ్యూల్:

వన్డే సిరీస్

6 జనవరి, 1వ ODI, RPICS కొలంబో

8 జనవరి, 2వ ODI, RPICS కొలంబో

11 జనవరి, 3వ ODI, RPICS కొలంబో

T20I సిరీస్

14 జనవరి, 1వ T20I, RPICS కొలంబో

16 జనవరి, 2వ T20I, RPICS కొలంబో

18 జనవరి, 3వ T20I, RPICS కొలంబో