శ్రీలంక క్రికెట్‌‌కు గుడ్ న్యూస్.. నిషేధం ఎత్తివేస్తూ  ఐసీసీ కీలక నిర్ణయం

శ్రీలంక క్రికెట్‌‌కు గుడ్ న్యూస్.. నిషేధం ఎత్తివేస్తూ  ఐసీసీ కీలక నిర్ణయం

శ్రీలంక క్రికెట్ కు ఐసీసీ శుభవార్త చెప్పేసింది. శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి)పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్  ఆదివారం (జనవరి 28) వెల్లడించింది. ప్రభుత్వ జోక్యం కారణంగా నవంబర్‌లో శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ సస్పెండ్ చేసింది. దీంతో అండర్ 19 పురుషుల ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను శ్రీలంక కోల్పోయింది. నిషేధం కారణంగా అండర్ 19 వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాకు మార్చబడింది.  

2023వన్డే వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ శ్రీలంక క్రికెట్ బోర్డ్ నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సస్పెన్షన్ ఎత్తేసేవరకు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఆడకూడదని సూచనప్రాయంగా చెప్పింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం శ్రీలంక క్రికెట్ బోర్డు కు షాక్ కు గురి చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో జరగాల్సిన అండర్ 19 వరల్డ్ కప్ ఐసీసీ దక్షిణాఫ్రికాకు మార్చింది.నిషేధం కారణంగా శ్రీలంక క్రికెట్ పునరాగమనం కష్టమే అనుకున్నారు. అయితే ఐసీసీ ఆ జట్టుపై నిషేధం ఎత్తివేస్తూ ఆనందాన్ని నింపింది.
 
ఐసీసీ ఈవెంట్స్, ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని నిబంధనలను లోబడి శ్రీలంక క్రికెట్ బోర్డు నడుచుకోవాలని ఐసీసీ తెలిపింది. శ్రీలంక క్రికెట్ నుండి వచ్చే నిధులపై ఐసీసీ నియంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా లంక బోర్డుపై ఐసీసీ పూర్తిగా నిషేధం తొలగిస్తున్నట్లుగా తెలియజేసింది.