శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురా కుమార దిసనాయకే

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురా కుమార దిసనాయకే

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనురా కుమార దిసనాయకే ఎన్నికయ్యారు. ఆదివారం ( సెప్టెంబర్ 22) నాడు శ్రీలంక దేశాధ్యక్షుడిగా అనురా కుమార దిసనాయకే ను శ్రీలంక ఎన్నికల సంఘం ప్రకటించింది. 

పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ కు చెందిన 55 యేళ్ల అనురా కుమార దిసనాయకే శనివారం జరిగిన ఎన్నికలలో 42.31 శాతం ఓట్లతో అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. ప్రత్యర్థి సజిగ్ ప్రేమదాస కంటే 1.3 మిలియన్ల ఓట్లతో దిసనాయకే విజేతగా నిలిచారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే 17 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. 

ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న శ్రీలకంలో శనివారం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. శ్రీలంకలో 17.1 మిలియన్ల ఓటర్లలో 76 శాతం మంది ఓటు వేశారు. అయితే అధ్యక్షుడిగా  ఎన్నికయ్యేందుకు కావాల్సిన 50 శాతం ఓట్లు దిసనాయకే సాధించలేకపోయారు. దీంతో ప్రెసిడెన్సియల్ ఓటింగ్ ద్వారా దిసనాయకే అధ్యక్షుడిగా ఎన్ని కయ్యారు.

శనివారం జరిగిన ఎన్నికల్లో ఏ అభ్యర్థి 50శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధించకపోవడంతో రెండో రౌండ్ కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించింది.  ఇప్పటి వరకు శ్రీలంకలో ఏ పోల్ రెండో రౌండ్ కౌంటింగ్‌కు వెళ్లలేదు. ఇప్పటివరకు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజేతలుగా నిలిచి దేశాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రెండో రౌండ్ కౌంటింగ్ వెళ్లడం ఇదే మొదటిసారి.