ఆసీస్తో టెస్టులో తడబడిన శ్రీలంక.. తొలిరోజు స్కోరు 229/9

ఆసీస్తో టెస్టులో తడబడిన శ్రీలంక.. తొలిరోజు స్కోరు 229/9

గాలె: ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభమైన రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రీలంక  తడబడింది.  తొలి రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లంక తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 90 ఓవర్లలో 229/9 స్కోరు చేసింది. దినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చండిమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (74), కుశాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (59 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) జట్టును ఆదుకున్నారు. కుశాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు లాహిరు కుమార (0 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన లంక ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెయిలైంది. 

పాథుమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిశాంక (11), మాథ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (1), కమిందు మెండిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (13), ధనంజయ డిసిల్వా (0) నిరాశపర్చారు. దిముత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరుణరత్నే (36) ఓ మాదిరిగా ఆడటంతో 150కే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కుశాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (28) ఏడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 65 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోడించారు. చివర్లో ప్రభాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయసూర్య (0), నిశాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీరిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0) డకౌటయ్యారు. స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లైయన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరో మూడు, మాథ్యూ కునెమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు వికెట్లు పడగొట్టారు.