వావ్.. శ్రీలంక బంగారు కప్ప.. చిత్తురులో కనివిందు

ఈ భూమి మీదు అనేక జీవరాశులు ఉంటాయి. కాలానుగుణంగా మారిన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మారిన ప్రాణులు మాత్రమే మనుగడ సాగిస్తుంటాయి. కాలుష్యం కారణంగా ఉన్న ఒకటిరెండూ ప్రాణులు కూడా చనిపోతున్నాయి. శాస్త్రవేత్తలు వాటిని గుర్తించి వాటి మనుగడకు కృషి చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో అరుదైన బంగారు కప్ప కనిపించింది. 

జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ఆంధ్రప్రదేశ్‌ బయోడైవర్శిటీ బోర్డుకు చెందిన పరిశోధకులు దీన్ని గుర్తించారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కనుమరుగైన అరుదైన జాతి కప్పను పరిశోధకులు చిత్తూరు జిల్లాలో గుర్తించారు. ఈ కప్పలు ప్రధానంగా చిత్తడి నేలలు, వ్యవసాయ భూమి, గడ్డిభూములలో కనిపిస్తాయి.

చిత్తూరు జిల్లా పలమనేరులోని కౌండిన్య అటవీ ప్రాంతంలో గౌనితిమ్మేపల్లి గ్రామ సమీపంలోని ఓ కుంటలో బంగారు కప్పను పరిశోధకులు గుర్తించారు. గోల్డెన్ బ్యాక్ ఫ్రాగ్ అని పిలిచే ఈ కప్ప వీపుభాగం బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చుంది. ఈ కప్ప శాస్త్రీయ నామం హైలారానా గ్రాసిలిస్‌.  శ్రీలంకలో ఎక్కువగా కనిపించే ఈ కప్ప వీపుపై బంగారు వర్ణం కలిగి, ఎక్కువ భాగం నలుపు రంగుతో ఉంటుంది. మరోవైపు భారతదేశంలో ఇప్పటి వరకూ 19 రకాల గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్స్ గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.