క్రికెట్ వరల్డ్ కప్ లో రెండు సమ ఉజ్జీల మధ్య పోరుకు నేడు రంగం సిద్ధమైంది. ఆసియా దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక తమ రెండో మ్యాచ్ లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ తీసుకోగా.. ఇరు జట్లు తమ ప్లేయింగ్ 11 లో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. ఫామ్ లేని ఫకర్ జమాన్ స్థానంలో అబ్దుల్లా షఫీక్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు శ్రీలంక స్టార్ స్పిన్నర్ తీక్షణ పేసర్ రజిత స్థానంలో జట్టులో చేరాడు. కాగా.. పాకిస్థాన్ తమ మొదటి మ్యాచులో నెదర్లాండ్స్ మీద విజయం సాధించగా.. శ్రీలంక సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడింది.
శ్రీలంక (ప్లేయింగ్ XI):
పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక
Also Read :- బాగా ఆడినా విమర్శించారు.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):
అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్ ), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్