శ్రీలంకతో భారత్ నేడు చివరి వన్డేకు సిద్ధమైంది. కొలంబో వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో భారత్ టాస్ ఓడిపోయింది. ఈ సిరీస్ లో వరుసగా మూడోసారి భారత్ టాస్ ఓడిపోవడం విశేషం. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ రెండు మారులతో బరిలోకి దిగింది. వికెట్ కీపర్ బ్యాటర్ గా రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ వచ్చాడు. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ స్థానంలో రియాన్ పరాగ్ కు చోటు దక్కింది. పరాగ్ కు ఇదే తొలి అంతర్జాతీయ వన్డే.
మరోవైపు శ్రీలంక ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. అఖిల ధనుంజయ్ స్థానంలో తీక్షణ ప్లేయింగ్ 11 లో వచ్చి చేరాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు రెండు వన్డేలు జరిగాయి. తొలి వన్డే టై కాగా.. రెండు వన్డేలో 32 పరుగుల తేడాతో శ్రీలంక గెలిచింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలిస్తే 2-0 తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. భారత్ గెలిస్తే 1-1 తో సిరీస్ ముగుస్తుంది.
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ (కెప్టెన్) , శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
శ్రీలంక (ప్లేయింగ్ XI):
పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో