రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో శ్రీలంక భారీ స్కోరు

రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో శ్రీలంక భారీ స్కోరు

గాలె : న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో శ్రీలంక భారీ స్కోరు చేసింది. కమింద్‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌ (182 నాటౌట్‌‌‌‌‌‌‌‌), కుశాల్‌‌‌‌‌‌‌‌ మెండిస్‌‌‌‌‌‌‌‌ (106 నాటౌట్‌‌‌‌‌‌‌‌) సెంచరీలతో చెలరేగడంతో.. శుక్రవారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను 163.4 ఓవర్లలో 602/5 స్కోరు వద్ద డిక్లేర్‌‌‌‌‌‌‌‌ చేసింది. 306/3  ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన లంక ఇన్నింగ్స్​లో కమింద్​..  మాథ్యూస్‌‌‌‌‌‌‌‌ (88) తో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 107, ధనంజయ (44)తో ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 74 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించాడు. చివర్లో  కుశాల్‌‌‌‌‌‌‌‌,  కమింద్‌‌‌‌‌‌‌‌ ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌కు 200 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసి భారీ స్కోరు అందించారు. 

గ్లెన్‌‌‌‌‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌ 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 14 ఓవర్లలో 22/2 స్కోరు చేసింది. విలియమ్సన్‌‌‌‌‌‌‌‌ (6 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), అజాజ్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ (0 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. టామ్‌‌‌‌‌‌‌‌ లాథమ్‌‌‌‌‌‌‌‌ (3), డేవన్‌‌‌‌‌‌‌‌ కాన్వే (9) విఫలమయ్యారు. అషితా ఫెర్నాండో, ప్రభాత్‌‌‌‌‌‌‌‌ చెరో వికెట్‌‌‌‌‌‌‌‌ తీశారు. కివీస్‌‌‌‌‌‌‌‌ ఇంకా 580 రన్స్‌‌‌‌‌‌‌‌ వెనకబడి ఉంది. ఇక టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో ఫాస్టెస్ట్‌‌‌‌‌‌‌‌ వెయ్యి రన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన మూడో బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా కమింద్‌‌‌‌‌‌‌‌.. బ్రాడ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ (13 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌) రికార్డును సమం చేశాడు. హెర్బర్ట్‌‌‌‌‌‌‌‌ సుట్‌‌‌‌‌‌‌‌క్లిఫ్‌‌‌‌‌‌‌‌ (ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ 12), ఎవర్టన్‌‌‌‌‌‌‌‌ వీక్స్‌‌‌‌‌‌‌‌ (వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌ 12) ముందున్నారు.